Friday, April 16, 2021

ఇదేగా మనకి దేవుడిచ్చిన అందమైన జీవితం..

కాలం మనల్ని వెనక్కి నెట్టినా,
పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం...
నిమిషాలన్ని విషమై కాటేస్తున్నా,
నిరంతరం నువ్వు నమ్మిన దారిలో ప్రయాణించడం
బాధ్యతలు భరించలేనంతగా బాధిస్తున్నా,
భరిస్తూ వాటిని భద్రంగా మోయడం...
కష్టాలు కన్నీటి కడలిలో ముంచేస్తున్నా,
వాటిని కరిగించేస్తూ మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం...
సంతోషాలు నీటి బుడగలా మారుతున్నా,
అవి పగిలేలోపే వాటిని ఆస్వాదించడం...
పగలు వెన్నెల కాసినా
రాతి భగభగ మండినా
నీ నీడ నిన్ను వీడిపోయినా
నీకు నిలువ చోటు లేకపోయినా
ఈ లోకంలో అసలు నీకు విలువ లేకపోయినా
నిన్ను నువ్వు ప్రేరణగా మార్చుకొని,
నువ్వు నువ్వు గా నవ్వుతూ జీవన గమనాన్ని కొనసాగించాలి... ఎందుకంటే ఇదేగా మనకి దేవుడిచ్చిన అందమైన జీవితం . .

🎊💦💥🌈🦚🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment