Sunday, May 1, 2022

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

ఎవరైనా మీ మాట నమ్మకపోతే
ఒట్టు వేసి నమ్మించడానికి అస్సలు
ప్రయత్నించకండి......

మన మీదే నమ్మకం లేనప్పుడు
ఇతరులపై ఒట్టు వేస్తే నమ్ముతారా....

నమ్మకం లేని చోట ఒట్టు కూడా
నమ్మకాన్ని కలిగించదు.......!!


🌹 ఓటమి అంటే
అవమానం కాదు...

మనల్ని మనం తెలుసుకునే
గొప్ప అవకాశం......!!

🌹 మోసం చేసేవారిది
తప్పు కాదు...

ఎందుకంటే వారి పనే అది...
మోసపోయేంతలా నమ్మడం
మన తప్పు.....!!

🌹 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా
గెలిచే దమ్ము లేనప్పుడే

నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం
మొదలుపెడతాడు....!!

🌹 కొన్నిసార్లు..... నీకు నువ్వే
భుజం తట్టుకోవాలి....,

ఎందుకంటే .....తట్టేవారి కంటే
నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో.....!!

కొన్నిసార్లు......
నీకు నువ్వే నవ్వించుకోవాలి,

ఎందుకంటే.... నవ్వించేవారి కంటే
నవ్వులపాలు చేసేవారు
ఎక్కువ ఈ లోకంలో......!!

🌹 తప్పు ఇతరులదైతే....
జడ్జిలా తీర్పిస్తాం......

తప్పు మనదైతే....
లాయర్ లా వాదిస్తాం......!!


🌹 మూర్ఖునితో వాదన...బోర్లించిన
కుండపై నీళ్ళు పోసినట్లే....
*🌅శుభోదయం...తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment