'' మమ్మీలు '' ఇలాంటి ' " అమ్మలు" అయితే !
🌷.నిద్రకు ముందు మంచి విషయాలు..
అమ్మ ఎప్పుడూ పిల్లలకు కోపం, విసుగు వున్నా మంచే నేర్పాలి...🌷
..... ...వీటి వల్ల జీవితం లో ఇప్పుడు వాళ్ళకి బాధ అనిపించినా మంచి ఉన్నత జీవితం అనుభవిస్తారు..🙂
ఇన్ఫోసిస్ ను స్థాపించిన రోజుల్లో సుధామూర్తి గారు ఆమె భర్త నారాయణమూర్తి గారు , సంస్థను పదికాలాల పాటు ధృఢంగా , విజయవంతంగా నిలబడాలని చాలా జాగ్రత్తగా దాన్ని నడుపుతూ వస్తున్నారు. వ్యక్తిగతంగా పొదుపు చేస్తూ , చక్కటి విలువలతో ఇన్ఫోసిస్ ను ముందుకు తీసుకెళ్ళాలి అనేది వారి ఆలోచన. వాళ్ళ కొడుకు రోహన్ మూర్తికి చాలా మంది స్నేహితులు అయ్యారు. ఒకసారి అతని పుట్టినరోజును ఖరీదైన స్టార్ హోటల్ లో జరుపుకొంటానని తల్లి సుధామూర్తితో చెపుతాడు. అపుడు ఆమె ''ఎంత ఖర్చు అవుతుంది ? '' అని అడుగుతారు. అందుకు అతను '' ఒక యాభై మంది స్నేహితులు రావచ్చు కాబట్టి సుమారుగా యాభైవేలు ఖర్చుకావచ్చు '' అంటాడు. అపుడు సుధామూర్తి గారు ,'' రోహన్ , ఒకసారి మన ఇంట్లో పనిచేసే ఈ పనిమనిషిని చూడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరి చదువుల ఖర్చు ఒక ఏడాదికి ఇరవైవేల రూపాయలు అవుతుందట. నీవు నీ పుట్టినరోజు వేడుకను వద్దనుకొంటే ఆ ఇద్దరు పేదపిల్లలు రెండు సంవత్సరాలు చదువుకోగలుగుతారు , ఆలోచించు. ఒకవేళ నీవు అనుకొంటూన్నట్టు ఆడంబరంగానే జరుపుకోవాలంటే , అలాగే కానిద్దాం.'' అంటారు. రాత్రంతా ఆలోచించిన రోహన్ మూర్తి ఉదయమే అమ్మ దగ్గరికొచ్చి , '' అమ్మా , నీవు చెప్పినట్టే చేద్దాం, '' అన్నాడట.సంతోషించిన సుధామూర్తి గారు , '' కానీ , రోహన్ నాకు మరో ఆలోచన కూడా వచ్చింది. అదేమంటే నీ స్నేహితులందరినీ మన ఇంటికే పిలువు. ఇక్కడే నీ పుట్టినరోజును జరుపుకొందాం ,'' అంటారు. '' అలాగే అమ్మా , '' అన్నాడు అతను. తన ఫ్రెండ్స్ అందరికి సమోసాతో పాటు ఒక రస్నా ప్యాకెట్ కూడా ఇవ్వాలని చిన్న షరతు పెట్టాడట. సుధామూర్తి గారు నవ్వుతూ అంగీకరించారు.
మరుసటిరోజు యాభైమందీ వచ్చారు. వాళ్ళందరికి ఒక వంటమనిషి తోడు తీసుకొని సుధామూర్తిగారే స్వయంగా వంటలు వండారట. అంతేకాదు, ఆరోజు ఇంట్లో పనిచేసే పనిమనిషికి రోహన్ చేతనే ఇరవైవేల రూపాయలు [ పిల్లల చదువులకోసం ] ఇప్పించారు. ఆ సంఘటన రోహన్ మూర్తి మీద ఎంత ప్రభావం చూపిందంటే , అతను తరువాత విదేశాలకెళ్ళి చదువుకొంటున్నపుడు , అక్కడి యూనివర్సిటీలు ఇచ్చే స్కాలర్ షిప్ ను మొత్తం పేదలకు ఉపయోగించమని బెంగళూరులో వున్న తల్లి సుధామూర్తి గారికి పంపించేసేవాడు.
మన పాఠశాలలు , కళాశాలల్లో ఇలాంటి సంఘటనలను విద్యార్థుల హృదయాలకు హత్తుకొనేలాగా చెప్పనంతవరకూ , మనం మన విద్యాలయాల ద్వారా డాక్టర్లు , ఇంజనీర్లు , బ్యాంకర్లు , వ్యాపారవేత్తలు మొదలైన వారిని తయారుచేయవచ్చేమే కానీ ''మనసున్న మనుషులను'' తయారుచేయలేము
🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్
సేకరణ

No comments:
Post a Comment