Wednesday, August 31, 2022

వినాయకుని నామాలు, వాటి అర్ధాలు......!!

 🎻🌹🙏వినాయకుని నామాలు, వాటి అర్ధాలు......!!          

 🌹1.  వాతాపి గణపతి :🌹

🌸గాలిని పానం చేయడం అని అర్థం. అంటే ప్రాణాయామాది సాధనల వల్ల వాయువుని నియంత్రించడం.

🌿 అదే వాతాపి లక్షణం. వినాయకుడు మూలాధార అధిష్టాన దేవత. కుండలినీ జాగరణ అక్కడే ప్రారంభమౌతుంది.

🌸 అటువంటి యోగంలో ముఖ్యమైనది వాయునియంత్రణ. ఏనుగు నీటిని లోనికి, పైకి పీల్చిన్నట్లు మూలాధారములోని కుండలినిని పైకి తీసుకువెళ్తేనే సిద్ధి.

🌿 కనుక ప్రాణవాయువును  నియంత్రించి ఆ ఊర్ధ్వ దిశలో పయనింపచేసే చైతన్యమే వాతాపి అలా యోగశక్తిగా ఉన్న గణపతినే వాతాపి గణపతి. అంటారు.

🌹 2.  ఉచ్చిష్ట గణపతి : 🌹

🌹అక్షరములకు ప్రభువు ఓంకారం. గణపతి ఓంకార స్వరూపుడు.

🌿 అక్షరములు అన్ని వెలువడేది నోటినుండే. నోటి నుండి వచ్చినది ఉచ్చిష్టo. కనక అక్షరపతే ఉచ్చిష్ట గణపతి.

🌹 3. మహాగణపతి/వరసిద్ధి వినాయకుడు :🌹

🌸మహా అనేది పరబ్రహ్మ వాచకము. గణపతి సర్వదేవతాత్మకడు. 11 చేతుల(10 చేతులు,1తొండం) తో వుంటాడు. 

🌿ఆయా చేతులలో వివిధ దేవత సంకేతాలుగా, వారి వారి ఆయుధాలను ధరిస్తాడు.అవి:

🌸ఒక చేతిలో చక్రం-పద్మం--విష్ణులక్ష్మీ తత్వం.
ఒక చేతిలో త్రిశూలం-పాశం--శివ పార్వతి తత్వం.

🌿చెఱుకువిల్లు,నల్లకలువ- మన్మధుడు, రతీదేవి తత్వం.
వరికంకి, గద- భూదేవి వరాహస్వామి తత్వం. 

🌸బీజాపూరం(దానిమ్మ పండు), ఏకదంతం -- పుష్టి, పుష్టి పతి తత్వం.
ఇక తొండంలో రత్న ఖచిత కలశం- మోక్షానికి సంకేతం.

🌹 4. లక్ష్మీ గణపతి :🌹

🌸ఎవరి శక్తి వారికి ఐశ్వర్యం! అదే లక్ష్మీ అంటే. (గాయకుడికి- పాడగలడమే శక్తి)

🌷గణపతి యొక్కశక్తి యే లక్ష్మీ  అంటే.(  విష్ణుపత్ని లక్ష్మి అని  ఇక్కడ కాదు.)🌷

🌹 5. నాట్య గణపతి :🌹

🌸ఆనందంగా ఉన్నప్పుడే నాట్యం చేస్తారు.ఆనంద గణపతే  నాట్య గణపతి అన్నా తాండవ గణపతిఅన్నా కూడా. 

🌿కాలం లయాత్మకo, ఊపిరీ లయాత్మకo అలా లయాత్మకంగా గమనం చేసే చైతన్యమే నాట్య గణపతి.

🌹 6. హేరంబ గణపతి :🌹

🌸శుభమైన శబ్ద స్వరూపుడు అంటే ఓంకార స్వరూపుడు.
హే=దీనులు, రంభ=పాలించువాడు దీనులను పాలించువాడు.

🌹 7. వినాయకుడు :🌹

🌿విగతనాయకుడే వినాయకుడు . అంటే ఆయనకు పై ఇక వేరే  నాయకుడు లేరు. వినయమును ఇచ్చువాడు  వినాయకుడు.

🌹8. మూషిక వాహనుడు :🌹

🌸గుండె గుహలోని జీవుడనే ఎలుక, ప్రపంచం చుట్టూ తిరిగి, విషయవాంఛలన్నీ ఆ హృదయ గృహలో అనుభవిస్తూ ఉంటాడు.

🌷 ఆ జీవాత్మని అధిష్టించిన పరమాత్మ మూషిక వాహనుడు.. .

🌿నోరుఅనే కలుగులో తిరిగే నాలుకే ఎలుక. దాన్ని అధిష్టించి వచ్చే అక్షరపతే గణపతి- మూషిక వాహనుడు.

🌸🌹09.  గణపతి :🌹
మనుషులు,  ఇంద్రియములు, పంచప్రాణాలు. 

🌿ఇలా ఏమి చూసినా గణములే. 
ఆ గణములన్నిటికీ పతియే - గణపతి....శుభ మస్తు..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment