నేటి ప్రపంచంలో మనం ఎలా ఉండాలో తెలుసుకుందాం
మిత్రమా ఏనాడు కూడా ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా ఒక్క రోజు కూడా down అవ్వకు..నీ చుట్టూ ఇంతకాలం జనాలు చప్పట్లు కొడుతూ ఉండొచ్చు..కానీ చాలా చప్పట్లలో నిజాయితీ తక్కువ..ఒక్కసారి నువ్వు తప్పటడుగు వేశావని గమనిస్తే..నీలో దైన్యాన్నీ, బేలతనాన్నీ, డల్నెస్నీ గమనిస్తే నీ చుట్టూ రకరకాల వంకలతో కోలుకోలేనంతగా సాలెగూళ్లు కట్టేస్తారు..ఆ సాలెగూటిలో మరింత ముడుచుకుపోయి నీ అస్తిత్వాన్ని కోల్పోవడం తప్పించి మార్గం లేదు..
యెస్..నిన్ను నీలా ఎవరూ ఉండనీయరు..కానీ నీలాగా నువ్వు ఉండు..నీకు చేయాలనిపించింది నువ్వు చెయ్యి. నువ్వు విజయంలో ఉండి నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నంత వరకే..నీ మాటల్లో కాన్ఫిడెన్స్ కొట్టొంచినంత వరకే నువ్వేం చెప్పినా జనాలు ఊ కొట్టేది...
ఏ క్షణమైతే నువ్వు బేలగా మారతావో ఆ క్షణం నుండి నీ మీద సానుభూతితోనూ, నీకు సూచనల పేరుతో నీ పర్సనల్ జోన్లోకి చొచ్చుకు వచ్చి..సున్నితమైన మాటలతో నిన్ను తిడుతూనే నీపై ఆధిపత్యం చెలాయిస్తారు..అంతేనా..నీ పనైపోయింది" అనేస్తారు..ఆ ఒక్క మాట చాలు నీకు మిగిలున్న జీవితం నీలో మానసికంగా సమాధి కావడానికి..
అందుకే దర్జాగా బ్రతుకు..రాజాలా బ్రతుకు..కంచు కంఠంతో మాట్లాడు..మాటల్లో కాన్ఫిడెన్స్ ఉట్టి పడాలి.. ఊరికే నసగకు.. నాలుగడుగులేస్తే కింద పడిపోతామేమో అన్నట్లు నడవకు..చురుకుగా, చలాకీగా నడువు.. నిన్ను చూస్తే పోయిన ప్రాణం లేచి రావాలి..పవర్‌కి కేరాఫ్ అడ్రస్‌గా కన్పించాలి..నీ ఎనర్జీ లెవల్స్ చూసి నీ జోలికి రావడానికి కూడా నీకు హాని చెయ్యాలనుకునే వారు భయపడాలి..ఈ ప్రపంచంలో కష్టపడి సాధించడం ఎంత కష్టమో..మానసికంగా నిరంతరం కాన్ఫిడెంట్‌గా ఉండడం అంతే కష్టం..
ఒక్క క్షణం కూడా నీ కాన్ఫిడెన్స్ లెవల్ కోల్పోకు..నీ చుట్టూ రాబందులు సిద్ధంగా ఉన్నాయి..నీ ధైర్యంతో అవి నీ జోలికి రాకుండా అడ్డుకో !!ఒక్కటి మాత్రం నిజం..నీ లైఫ్ అయిపోయిందని భావిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్లు సాయంత్రానికల్లా నీకు సమాధి సిద్ధం చేస్తారు..
నీకు నువ్వు కారణ జన్ముడిగా భావిస్తే..నీ ఆలోచనలు, నీ భావాలు నీ చర్యలు ధైర్యంగా ఉంటే సమాధి బదులు సన్మానాలతో సిద్ధంగా ఉంటావు ..
????????
చివరిగా మరొక్క మాట .ద్వేషం వద్దు అది హృదయాన్ని నాశనం చేస్తుంది దురాశ "వద్దు,అది సంస్కారాన్ని దిక్కరిస్తుందిభేదభావం" వద్దు,అది మనుష్యుల మధ్యఅగాధాన్ని సృష్టిస్తుంది.స్వార్ధం వద్దు."అది జీవితాన్నే మింగేస్తుంది
ఇవన్నీ వద్దునకునే ప్రతి మినిషి "గొప్పవాడే"
సేకరణ. మానస సరోవరం
No comments:
Post a Comment