💓🙏భావనా శక్తి🙏💓
(The Power of Emotion)
మనం దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించే మానవులము కాము! నిజానికి మనము మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దైవాలము!
దైవత్వము అన్నది మనకు ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటున్నది.
మనము ఏది అడిగితే అది ఇవ్వడానికి దైవత్వము ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. మరి మనము మన మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, భావాల ద్వారా, సంజ్ఞల ద్వారా మనము నిరంతరమూ దైవత్వంతో సంభాషణలు జరుపుతున్నాము.
ఏది ఏమైనా "యద్భావం తద్భవతి"! మనం దైవత్వంతో సంభాషణలు జరిపేటప్పుడే అవి మాటలైనా, ఆలోచనలైనా, భావాలైనా సంజ్ఞలైనా భావనే (Feeling) ప్రధానం!!
అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన నెగెటివ్ శక్తి కల్గియున్న భావన భయం.(fear). మరీ ఈ భయంలోంచే అన్ని నెగెటివ్ భావాలు పుట్టుకొస్తున్నాయి.
ఈనాడు మానవుడి హృదయాంతరాలలో 'భయం' పాతుకు పోయింది.
అందుకే మానవుడి జీవితం భయభ్రాంతులతో అస్తవ్యస్తమై అతలాకుతలమై
అంధకారబంధురమై పోయింది. అత్యంత శక్తివంతమైన పాజిటివ్ శక్తిగల భావన ప్రేమ (Love). ప్రేమకు మించిన శక్తి ఈ సృష్టిలో లేదు. మానవ హృదయంలోంచి వెలువడే అత్యంత శక్తివంతమైన భావన "ప్రేమ"
ప్రేమ అన్నింటినీ స్వస్థత చేయగలదు. ప్రేమకు మించిన ఔషధము లేదు(Love is a miraculous cure) అన్ని శారీరక సమస్యలను, మానసిక సమస్యలను, ఆధ్యాత్మిక పరమైన సమస్యలను పరిష్కరించగల్గిన శక్తి ప్రేమకు తప్ప మరిక దేనికీ లేదు. ప్రేమశక్తి అన్ని మానసిక జాడ్యాలను, అన్ని సంబంధ బాంధవ్యాలను అన్ని ఆర్థిక సమస్యలను ఓటమికి సంబంధించిన అన్ని సమస్యలను నయం చేయగలదు.
నిజానికి స్వచ్ఛమైన ప్రేమ అనునది "మనల్ని మనం ప్రేమించుకోవడముతో (Loving ourselves) ప్రారంభమవుతుంది. మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకున్న నాడు మనకు జీవితం అన్ని కోణాల్లోనూ అనుకూలిస్తుంది.
మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకోవాలంటే మనల్ని మనము సంపూర్ణంగా క్షమించుకోవాలి (Completely forgiving ourselves) మరి తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించేయాలి.
మన శరీరంలో ఏదైనా అనారోగ్యముంటే మొదట ఎవరిని క్షమించాలా అని మన హృదయాల్లో వెతుక్కోవాలి. ఎందుకంటే అన్ని అనారోగ్య సమస్యలూ చిన్న గాయం నుండి పెద్ద ఎయిడ్స్ వరకు ఈ క్షమాతత్త్వం లేకపోవడము వలననే సోకుతున్నాయి.
మనల్ని మనము సంపూర్ణంగా క్షమించుకుని తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించివేస్తే "కర్మ" కూడా క్షయమైపోతుంది.
కావున నిజమైన ఆథ్యాత్మిక అంటే స్వచ్ఛమైన కారణరహితమైన ప్రేమతోనూ(unconditional Love) మరి క్షమాతత్త్వముతో (forgiveness) నూ జీవించడమే!
మరి ఆధ్యాత్మికత మొదలయ్యేది మన స్వంత సహజమైన శ్వాసను మనము గమనించడం ద్వారా (observing our own natural breathing pro ces)! అంటే శ్వాసమీద ధ్యాస ద్వారా!!! ఈ 'శ్వాస మీద ధ్యాస' అనునది ఆధ్యాత్మక జీవితానికి ఆరంగేట్రం!
No comments:
Post a Comment