Wednesday, October 26, 2022

కర్మలు

 *🍁కర్మలు🍁*

✍️ మురళీ మోహన్ 
🍁 అనగనగా ఒక రాజు ఉండేవాడు .ఆ రాజు ఒకసారి తన రాజ ప్రసాదం లో తన ముగ్గురు మంత్రులను రమ్మని ఆదేశించాడు .వాళ్ళు వచ్చిన తరువాత వారికి మూడు సంచులు ఇచ్చి తోటలోకి వెళ్లి మంచి పళ్ళు కోసుకొని సంచులు నింపుకొని తొందరగా రావాలని ఆదేశించాడు.మంత్రులు వెంటనే తోటలోకి వెళ్లి కోయడం మొదలు పెట్టారు.

1)మొదటి మంత్రి:కష్టమైనా పర్వాలేదు అనుకోని రాజు కోసం మంచి మంచి పళ్ళు ,రాజుకు ఇష్టమైన పళ్ళు కోసి సంచి నింపాడు.

2)రెండో మంత్రి : ఆ రాజు ఇవన్ని పరీక్షా పెట్టి చూస్తాడ ఏదో ఒకటి అనుకోని కొన్నిమంచి పళ్ళు,కొన్ని పండనివి మరికొన్ని పనికిరానివి అన్ని కలిపి తొందరగా సంచి నింపుతాడు.

3)మూడో మంత్రి: రాజు ఎన్ని పళ్ళు తెచ్చారు ,ఎలా ఉన్నాయి అని చూస్తాడ ? ఆయనకి నిండిన సంచులను చూస్తాడు అంతే అని అనుకోని సంచి లోపల గడ్డి వేసి సంచి నింపాడు.మిగతా వారి కంటే తొందరగా ఇతని పని అయిపొయింది.

రెండో రోజు ఆ రాజు ముగ్గురి మంత్రులను పిలిచి ఆ సంచుల్లో ఏముందో కూడా తెలుసుకోకుండా వారిని 3 మాసాలు ఆ సంచులతో సహా ఖైదు చెయ్యవలసిందిగా సైనికులకు ఉత్తర్వులు ఇచ్చాడు.
ఆ కారాగారం లో మూడు మాసాల వరకు వారికి తినడానికి ఏంలేదు వారు తెచ్చుకున్న సంచులలో పళ్ళు తప్ప .మొదటి మంత్రి మాత్రం తను తెచ్చుకున్న మంచి పళ్ళు తినుకుంటూ మూడు నెలలు గడిచిపోయాయి . ఇక రెండో మంత్రి తను తెచ్చుకున్న కొన్ని మంచి పళ్ళు తిని ఆ తరువాత పనికిరాని పళ్ళు తినడం వల్ల అతని ఆరోగ్యం దెబ్బతింది.మూడో మంత్రి తను తెచ్చుకున్న గడ్డి వల్ల తనకి ఎం ఆహారం దొరకక కొన్ని రోజుల్లోనే చనిపోయాడు.

😱   ఒకసారి మనం అందరం ఆలోచికుందాం మనం ఏం కర్మలు చేస్తున్నామని.ఎందుకంటే మన కర్మనుసారమే మనకు ప్రతిఫలము లభిస్తుంది.ఆ భగవంతుడు సర్వంతర్యామీ అన్ని చూస్తుంటాడు.మన సత్కర్మలకు ,మన దుష్కర్మలకు మనమే బాధ్యులం. 🍁

No comments:

Post a Comment