ఈ ప్రపంచంలో సగం సమస్యలు మనకు మనం నచ్చకపోవడం వల్లనే వస్తాయి. వాళ్లు తక్కువగా చూశారనీ, వీళ్లు తక్కువగా చూశారనీ... లేదా లైఫ్‌లో ఏదీ సాధించలేకపోతున్నామనీ రకరకాల ఆలోచనలు చేస్తూ మనల్ని మనం గిల్టీ ఫీలింగ్‌కి గురి చేసుకుంటూ ఉండడం అతి పెద్ద తప్పు. నువ్వు ఎవ్వడికీ సంజాయిషీలు చెప్పుకోవాల్సిన పనిలేదు. నీ లైఫ్ నీది. అలాగే నువ్వు ఎవరికీ నచ్చాల్సిన పనిలేదు. నువ్వేం పెళ్లి చూపుల్లో కూర్చోవట్లేదు.. ఎవరో వచ్చి నిన్ను జడ్జ్ చెయ్యడానికి! ఫస్ట్ నిన్ను నువ్వు accept చేసుకో. నీలో ఇన్‌ఫీరియారిటీనీ, ఇన్‌సెక్యూరిటీని పెంచుతున్న థాట్స్‌ని అనలైజ్ చెయ్యి. ఏం చేస్తే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుందో కాస్త శ్రద్ధపెట్టు.
ఒక్కసారి నీకు నువ్వు నచ్చడం మొదలుపెడితే నీ బాడీ లాంగ్వేజ్‌లో, నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ చూపుల్లో ఓ ప్రత్యేకమైన శక్తి వస్తుంది. దాన్ని నీ చుట్టూ ఉన్న ప్రతీ ఒక్కరూ అనుభూతి చెందుతారు. నిన్ను చులకనగా చూడాలంటే భయపడతారు, ముడుచుకుపోతారు.. నిన్ను గౌరవిస్తారు. సో జస్ట్ నీపై నీకు కాన్ఫిడెన్స్ పెంచుకుంటే చాలు.. నువ్వనుకుంటున్న నీ చుట్టూ ఉన్న పదిమంది నీ దగ్గర తోక జాడించడానికి భయపడతారు.
ఎప్పుడూ నీ లైఫ్ ఇంకోడి కంట్రోల్‌లో పెట్టకు. నువ్వు ఇంకోడిని చూసి ఎమోషనలైజ్ అవుతున్నావంటే నీ లైఫ్ వాడి కంట్రోల్‌లో ఉన్నట్లే. అవతలి వాడి కోపాన్నీ, అవతలి వాడు నీ పట్ల చూపించే ద్వేషాన్నీ లైట్ తీస్కొని నీ పని నువ్వు బుద్ధిగా చేసుకో.
వాడెవడో ఇమెచ్యూర్డ్ ఫెలో బిహేవియర్ కూడా నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే.. ఇలాంటోళ్లు వందలమంది పుట్టుకొస్తారు. ప్రతోడీ దగ్గరా బాధపడుతూ ఎదగడం ఆపేస్తావా?
నిన్ను నువ్వు ఇష్టపడు. నీ దృష్టిలో నువ్వే ప్రపంచం. అందంగా తయారవ్వు.. బాగా డ్రెస్ చేసుకో... హుందాగా మాట్లాడు... ధైర్యంగా మాట్లాడు.. కాన్ఫిడెంట్‌గా ఉండు.. నిన్ను నువ్వు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా ఫీలవ్వు.. నిన్ను టచ్ చెయ్యడానికి కూడా ఎవరూ సాహసించరు!!
సేకరణ .మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment