Tuesday, October 25, 2022

గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ కాస్తంత కటువుగా.. 'అవ్యభిచారణ భక్తి' కలిగి ఉండు” అన్నాడు.

 221022a1932.    231022-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀673.
నేటి…

              ఆచార్య సద్బోధన:  
                  ➖➖➖✍️


"గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ కాస్తంత కటువుగా.. 'అవ్యభిచారణ భక్తి' కలిగి ఉండు” అన్నాడు.        

అంటే భక్తిలో వ్యభిచారము ఉండకూడదు అని చెప్పాడు. 

మీరు రకరకాల విగ్రహాలను పూజిస్తుంటారు. అయితే ఏ విగ్రహానికి హారతి ఇవ్వకపోతే ఎవరికి కోపం వస్తుందో అంటూ హారతులు నివేదనలు సమర్పించడంలో మునిగిపోతారు కానీ భక్తి ఉండదు. ఒక వేళ భక్తి ఉన్నా అది రోజుకో దేవత మీద ఉంటుంది. గురువారం సాయిబాబా ఆలయం ముందు ఉన్న క్యూలు, శుక్రవారం అమ్మవారి ఆలయం ముందు, శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ముందు కనిపిస్తాయి.

అంటే భక్తి రోజు రోజూ మారుతూ ఉందన్న మాట. దీన్నే పరమాత్మ వ్యభిచారినీ భక్తి అన్నాడు!  

ఇట్లాంటి భక్తి వలన ఉపయోగము ఏమి ఉండదు. “సర్వదేవ నమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి" అని తెలుపుతున్నాయి శాస్త్రాలు.       

ఎవరికి నమస్కరించినా ఆ పరమేశ్వరునికే చెల్లుతుంది. కనుక భగవంతుడు ఒక్కడే అని భావించి  స్థిరముగా నమ్మండి! ఆయన యందే నిత్యమూ చిత్తమును నిలపండి. మీరు తప్పక ఉద్ధరింపబడతారు."✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment