*ఆధ్యాత్మిక ఆదర్శం*
✳️🌈💫🌈💫❇️✅✳️💫🌈💫🌈✳️
❇️ ప్రతి మనిషికీ ఒక జీవిత ఆదర్శం ఉండి తీరాలి. ఆదర్శం అంటే జీవితాన్ని ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకునే ఆలోచన, ఆచరణ. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకుంటే, సునాయాసంగా అభివృద్ధి సోపానాలు అధిరోహించవచ్చు.
✳️ తల్లిదండ్రుల పోరు పడలేక చదవాల్సివస్తోంది అనుకుంటూ మొక్కుబడిగా చదివితే, ముక్కున పట్టిన విద్య తుమ్మగానే జారిపోతుంది.
✳️ విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం చదివే చదువు కాదు. అక్షరంలోనే అనంతజ్ఞానం, అద్భుతశక్తి దాగి ఉన్నాయి. అక్షర తపస్సు చేసినప్పుడే శక్తి లభించి, జ్ఞానఫలాలు దక్కుతాయి.
❇️ మహామంత్రాలన్నీ బీజాక్షర సంపుటాలే. తెలుగులో ఉండేవి యాభైఆరు అక్షరాలే. కానీ, అవి వివిధ మేళవింపుల్లో కథలు, కావ్యాలు, గీతాలు, సంగీతాలుగా మారిపోతాయి.
✳️ ఆ విధంగా వాటిని రూపకల్పన చేయగల నైపుణ్యం కోసమే అక్షరాన్ని ఆత్మగా చేసుకుని అధ్యయనం చెయ్యాలి.
✳️ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతిరూపమే 'ఓంకారము' అని వేదాలు చెబుతున్నాయి. ఇటీవల సూర్య దేవుడి నుంచి వెలువడే ధ్వనితరంగాలు ‘ఓం’ కార శబ్దంగా పరిశోధనలు వెల్లడించాయి.
✳️ మనిషి అజ్ఞానం ఎలా ఉంటుందంటే - తనకు తెలిసిందే జ్ఞానం, తెలియనివన్నీ శూన్యం అనుకుంటాడు. మన నేత్రాలు చూడలేనివి ఎన్నో ఉన్నాయి. మన మేధకు అందనివీ మరెన్నో ఉన్నాయి. ఆ విషయం మనకు అర్థం కానంతవరకూ మనమే ఘనులమనే భ్రమలో బతుకుతుంటాం.
✳️ చక్రవర్తి తనను తాను భగవంతుడితో సమం అనుకుంటాడు. మేధావి తానే మహాజ్ఞాని అనుకుంటాడు. మహాధనికుడు తానే అపర కుబేరుడిని అనుకుంటాడు. సౌందర్యవతి తానే అప్సరసను అనుకుంటుంది. ఇలా ఎవరికి వారు తామే అధికులమని విర్రవీగుతుంటారు.
✳️ వారి అహంకారాన్ని కాలం అనాయాసంగా తుడిచిపెట్టేస్తుంది. వారి పరిమితులు ఆయువు తీరేవరకేనని తేటతెల్లం చేస్తుంది.
✳️ దైవం ఉన్నాడా లేడా, స్వర్గ నరకాలు నిజమా అబద్ధమా, పాపపుణ్యాలను నమ్మాలా వద్దా... ఇలాంటి తర్కవితర్కాల మధ్య జీవితం చివరి మజిలీకి చేరువైపోతుంది. అప్పుడు నోరు తెరుచుకుని కొండచిలువలా మనకోసం ఎదురు చూస్తున్న మృత్యువుకు ఆహారం కాక తప్పదు.
✳️ ప్రాపంచిక ఆదర్శాలన్నీ ధనకనకవస్తువాహనాల ఆర్జన, హోదా, అధికారం, సుఖసౌఖ్యాలకు సంబంధించినవే.
✅ ఇందుకు పూర్తి భిన్నమైనది *ఆధ్యాత్మిక ఆదర్శం.* దీంట్లో పెట్టుబడి స్వల్పం. ఫలితం అనంతం.
✅ శ్రద్ధ, భక్తి- వీటితో పోల్చదగిన ఆధ్యాత్మిక ఆదర్శం మరొకటి లేదు. విశ్వాసం ఈ రెండింటికీ ఇరుసు. భక్తుడు-భగవంతుడు మధ్య అవిశ్వాసం, అతి బద్ధకం, అత్యాశల వంటి అడ్డుగోడలుంటాయి. వీటిని నిర్మలభక్తితో అధిగమించాలి.
✅ మనం నిజాయతీగా ప్రయత్నిస్తే, ఆప్యాయంగా ఆయన చేతులు చాచి మనల్ని తనవైపు లాక్కుంటాడు. మన ఆలోచనకు శబ్దం ఉండదు. కానీ, అది అంతర్యామికి ఆ క్షణంలోనే అర్థమైపోతుంది. మన ఆచరణకు సాక్షులు ఉండకపోవచ్చు. కానీ, ఆయన అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఈ ఎరుక మనకు ఉండి తీరాలి.
✅ అది లేనంత వరకు మనకు అంతర్యామి అర్థం కాడు. ఎంత ప్రయత్నించినా అగుపించడు.
🙏 *ఆధ్యాత్మిక ఆదర్శం అంటే - భక్తి నటించకపోవడం, భగవంతుడికి పరీక్షలు పెట్టకపోవడం, మన సర్వశక్తులు ఏకీకృతం చేసి అంతర్యామిని అర్చించడమే!*
✳️🌈💫🌈💫✳️✅❇️💫🌈💫🌈✳️
No comments:
Post a Comment