🙏🕉🙏 ...... *"శ్రీ"*
🔥 *"20"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు "*
*"ఒక కోటీశ్వరుడు స్వప్నంలో దరిద్రుడుగా మారి ఆకలితో అలమటిస్తూ ఆ వీధిలో ఈ వీధిలో అడుక్కుంటూ ఉండగా మెలుకువ వచ్చిందనుకో అలా!"*
*"అలా ఆనందమనే ఆత్మ తనలో ఏర్పడిన మనస్సనే భ్రమలోంచి మెలుకువలోకి వచ్చాక తనను తాను గుర్తెరిగి "తన స్వస్వరూపమయిన “బ్రహ్మానందం”లో లయమైపోతుంది."*
*అదే మానవునికి “మోక్షం”.*
*"ఇప్పుడు చెప్పండి ఈ మనస్సు – కోరికలు - ఆనందం అనేదాంట్లో ఉన్న సత్యం ఎంతో..!"*
*"మనస్సును నమ్మితే అది కొన్ని లక్షల జన్మల పాటు ఈ లోకాలు అనే భ్రమల్లో రకరకాల శరీరాలతో మిమ్మల్ని తిప్పుతూనే ఉంటుంది."*
*"ఎప్పటికప్పుడు అప్పటికి కలిగి ఉన్న ఈ శరీరాన్ని చూసుకుంటూ “ఇదే నేను” అనుకుంటూ జన్మ మృత్యువు అనే అనుభవాలను పొందుతూ దానితో పాటు మీరు ఈ లోకాలలో తిరుగుతూనే ఉంటారు."*
*"ఎప్పటికీ శాశ్వతమయిన ఆనందం, శాంతి మీకు లభించదు."*
*"కాబట్టి మనస్సును వదలి ఆత్మ వైపు చూడండి."*
*"బ్రహ్మానందం లభిస్తుంది."*
*"మోక్షం లభిస్తుంది."*
*"కోరికలను వదలడమంటే అర్ధం ఆనందాన్ని వదలడం కాదని, దుఃఖాన్ని వదలడం అని గ్రహించండి."*
*"మనసులో కలుగుతున్న కోరికలను ఆపగలిగితే కొన్నాళ్ళకు మనస్సు మాయమైపోతుంది."*
*"అప్పుడు “బ్రహ్మానందం” అనుభవంలోకి వస్తుంది."*
*"అదే మీ స్వరూపం."*
*"చివరిగా..."*
*"ఈ లోకంలో భౌతికమయిన ఆనందాన్ని అనుభవించాక మనిషికి దిగులు చెందడం తప్పనిసరి అవుతుంది."*
*"ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనిషి అనుభవించే ప్రతి ఆనందం అనే అనుభవానికీ ఒక కారణం ఉంటుంది."*
*"ఆ కారణం ప్రక్కకు తొలగగానే తిరిగి దుఃఖం మొదలవుతుంది."*
*"మనస్సు ఈ లోకంనుంచి ఏదో కోరుకోవడం, కోరుకున్నదాన్ని పొందడం, పొందినదాన్నుంచి కొద్ది క్షణాలు కల్పిత ఆనందాన్ని పొందడం."*
*"ఇక పొందింది తననుంచి తొలగిపోగానే తిరిగి దుఃఖించడం."*
*"తేరుకుని మళ్ళీ ఇంకేదో లభిస్తే ఆనందం అనుకుంటూ మరోదానికొరకు ప్రయత్నం చేస్తూ ఉండడం."*
*"ఈ లోకంలో మనిషి ఈ మనస్సు వెంట నడవడం వల్ల ఇంతకంటే ఒరిగేది ఏమయినా ఉందా?"*
*"కాబట్టి ఇదంతా చివరికి దుఃఖం కొరకే అని అందరూ గ్రహించాలి."*
*"ఎందుకంటే ఆనందం కొరకని మనిషి కష్టపడి ఇక్కడ పొందేదేదీ అతడికి శాశ్వతమయిన ఆనందాన్ని ఇవ్వట్లేదు."*
*"అనుభవించే సమయంలో కొద్ది ఆనందం.. అనుభవించడం అయ్యాక తిరిగి దుఃఖం."*
*"అందుకే ఈ లోకంలో పొందబడేవాటితో లభించే ఆనందం అశాశ్వతం అని గ్రహించి శాశ్వతమయిన ఆనందం కొరకు ఆత్మ వైపు దృష్టి సారించమని జ్ఞానులు మనకు చెబుతున్నారు."*
*"ఏ ఆనందం అయితే ఒక కారణం అంటూ లేకుండానే శాశ్వతంగా మనిషిలో అన్ని సమయాలలో ఏర్పడి ఉందో అదే ఆత్మానందం."*
*"అక్కడ ఇక దుఃఖానికంటూ ఎటువంటి స్థానమూ ఉండదు."*
*"ఆ ఆనందాన్ని మనిషి పొందాలి అంటే మనసులో కలిగే కోరికలను బుద్ధితో అదుపుచెయ్యడంవల్ల కొన్నాళ్ళకు మనస్సు ఆత్మ అనే బ్రహ్మానందంలో ఏకమైపోతుంది."*
*"అప్పుడు మనిషికి అకృత్రిమమయిన శాశ్వతమయిన ఆ బ్రహ్మానందం లభిస్తుంది."*
*"ఇంతటి సత్యాన్ని చెవికి ఎక్కించుకోనివారిని ఏ దేవుడు మాత్రం కాపాడగలడు. మనసుతో ఏదీ సంకల్పించకుండా మనసును ప్రతిక్షణం నిశ్చలంగా ఉంచుకోవాలి."*
*"కోరికలు అన్నీ కలిగేది మనసులోంచే గదా ఆ మనసును ఆలోచించనివ్వకుండా అడ్డుకుని నిశ్చలంగా ఉంచుకోవడం సాధన చేస్తే ఇక కోరికలు అనేవి ఎందులోంచి కలుగుతాయి?"*
*"కోరికలు ఏర్పడే మనసును విషయ రహితం చేసి కట్టడి చేస్తే ఇక కోరికలు ఆగిపోయినట్లేగదా!"*
*"అలాగే మీవద్దకు జనులు వచ్చి చెప్పే అనవసర లోక విషయాలు విననే వినకండి."*
*"మీ చెవుల ద్వారా మీ మనసులోకి ఒక్క ముక్క కూడా లోకవిషయాలను వెల్లనివ్వకండి."*
*"మీ నాలుకతో కూడా ఒక్క ముక్క కూడా లోక విషయాలు ఇతరులతో మాట్లాడకండి."*
*"మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసు అదీ ఇదీ ఆలోచించకుండా ధ్యానం లాంటి స్థితిలో మీ మనసును ఆలోచనా రహితంగా నిలుపుకుని నిశ్చలంగా ఉంచండి."*
*"మీరు నడుస్తున్నా, నించుని ఉన్నా, పొడుకుని ఉన్నా, తింటున్నా, స్నానం చేస్తున్నా, ఒంటరిగా ఉన్నా, వ్యక్తులతో ఉన్నా అన్ని సమయాలలో కూడా మీ మనసులో ఆలోచనలు అనేవి రానివ్వకుండా నిశ్చలంగా ఒక యోగి లాగా చూపు కలిగి ఉండండి."*
*"ఈ శరీరం యొక్క ఆయుష్షు ఉన్నంతవరకు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ జీవితాన్ని గడపండి."*
*"ఈ అత్యద్భుత సాధన ఒకనాటికి మిమ్ములను మీయొక్క స్వీయసామ్రాజ్యమయిన ఆత్మ అనే బ్రహ్మానందసాగరంలో ప్రవేసింపజేస్తుంది."*
*"ఇదే సత్యం ఇదే మార్గం ఇదే మానవజన్మ లక్ష్యం."*
*"ఇంతకు మించిన సత్యమూ లేదు మార్గమూ లేదు లక్ష్యమూ లేదు."*
*"మనసు కోరుకునేవి మనసుకు ఇవ్వకపోవడం వల్ల మొదట్లో మన ముఖం కొంత విచారంగా వున్నట్లు జనులు గుర్తిస్తారు."*
*"అంత మాత్రానికే సుఖాలన్నీ కోల్పోతున్నాం అని కొందరి మాటలు విని మళ్ళీ వాటిలోకి వెళ్ళవద్దు."*
*"మనసును కట్టడి చెయ్యడం వల్ల మనసు పడే బాధ ముఖంలో కొంతకాలం మాత్రమే కనిపిస్తుంది."*
*"కానీ లోన ఎంతో ధైర్యం పెరుగుతూ వస్తుంటుంది."*
*"అది మీకు మాత్రమే తెలుస్తుంది."*
*"ఆ దశలో మనసు భౌతికమయిన సుఖాలలోకి వెళ్ళడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంటుంది."*
*"మీరు పట్టు సడలించకుండా మనసును ఆపాలి."*
*"మనస్సు ప్రయత్నించి ప్రయత్నించి చివరికి బలహీనమయిపోతుంది."*
*"బలహీనమయి పోయిన మనసు ఒకానొక క్షణంలో ఆత్మలోకి ప్రవేశించి అందులో విలీనమైపోతుంది."*
*"అప్పుడు మీ ముఖంలోకి “దివ్యతేజస్సు” వచ్చేస్తుంది."*
*"మీ ముఖ మండలం కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది."*
*"ఆ తేజస్సు ను చూసిన జనులు ఆశ్చర్యపోతూ ఇతడు “భగవంతుడు” అని చెప్పుకుంటూ ఉంటారు."*
*"జనం అంతా మీకు నమస్కరిస్తుంటారు."*
*"అట్టి స్థితిలో వున్న మీకు జనుల నమస్కారాలు గానీ, కానుకలు గానీ, పొగడ్తలు గానీ అంటవు."*
*"ఎందుకంటే అప్పుడు మీ దృష్టిలో జనులు, వస్తువులు, పొగడ్తలు, లోకాలు ఉండవు."*
*"మీరు ధరించిన శరీరం దాని స్వభావం ప్రకారం అది నశించేంత వరకు ఈ లోకంలో నిలిచి వుంటుంది."*
*"కానీ మీ దృష్టి మీ శరీరం మీద ఉండదు."*
*"మీ యొక్క కన్నులు జనులను చూస్తున్నట్లుగా, పలకరిస్తున్నట్లుగా ఉంటాయి."*
*"కానీ మీ దృష్టి మీ కన్నులలో ఉండదు."*
*"మీరు మీదయిన “మోక్షానందం”లో తేలియాడుతూ ఉంటారు."*
*"శుభం భూయాత్."*
*"(సమాప్తం)"*
No comments:
Post a Comment