Wednesday, March 8, 2023

మహాలక్ష్మి మరో పేరు కమల 🌹 🔥దశ మహావిద్యలు🔥

 🌹మహాలక్ష్మి మరో పేరు కమల 🌹
🔥దశ మహావిద్యలు🔥
🍁🍁🍁🍁🍁🍁🍁

తంత్ర శాస్త్రంలో ప్రప్రదమంగా చప్పుకో దగినవి దశమహావిద్యలు. దశమహావిద్యలు అని పేర్కొనబడిన మంత్ర విద్యలకు 10 మంది దేవతలు అధిపతులుగా ఉన్నారు. దక్షిణాచారము లేదా వామాచారము అని పిలువబడే తాంత్రిక విధానాలు అదర్వణవేదం నుండి తీసుకొనబడ్డాయి.ఒక మంత్ర దేవత మానవ రక్షణకు మరియు నాశనానికి కూడా ఉపయెాగించటం జరుగుతుంది.

పరమ శివుని భార్య అయిన సతీదేవి తండ్రి దక్షప్రజాపతి తలపెట్టిన యజ్ఙంకు వెళ్ళుటకు నిర్ణయించుకుని పరమ శివునితో చెప్పగా, శివుడు దక్షప్రజాపతి ఆంతర్యము ఎరిగినవాడై పిలుపు లేని చోటుకు వెళ్ళరాదని వారించెను. వెంటనే సతీదేవి కోపంతో పరమ శివునికి తన నిజరూపమైన ఆదిపరాశక్తి అవతారము దాల్చి మహా శివుని ముందు తన శక్తితో 10 అవతారాలతో 10 వైపులా శివుని అడ్డుకుంది.

ఈ 10 అవతారాలే దశమహావిద్యలు. ప్రతి అవతారమునకు ఒక పేరు, కధ, లక్షణము మరియు మంత్రము కలదు.

ఈ 10 అవతారాలతో ఆదిపరాశక్తి పరమశివుడిని 10 దిక్కులా బంధించి తన శక్తిని చూపించింది. 
ఈ అవతారాలలో అమ్మవారు ఒక వైపు భయంకర రూపంతో కనిపిస్తూనే మరోవైపు అందమైన శక్తి స్వరూపిణిగా సర్వ విద్యలకు అధినాయకిగా చెప్పబడినది.

దశమహావిద్యలు పేరుకు తగ్గట్టుగ అపారమైన జ్ఙాన మూర్తులుగా తెలుపబడ్డారు. ప్రతి ఒక అవతారము ఒక ప్రత్యేకతను కలిగి ఉంది.ఆధ్యాత్మికతను సంతరించుకున్నవారికి ఈ దశమహావిద్యలు ఎంతో ప్రేమ, ధైర్యము, జ్ఙానముతో కనిపిస్తాయి.

తాంత్రికులకు ఆరాధ్య దేవతలుగా ఈ పది మంది దేవతలు ప్రాముఖ్యం చెంది ఉన్నారు.
వీరిలో మొదటి ఐదుగురు దేవతలు ఉగ్రదేవతలుగా గుర్తించబడ్డారు. కానీ వారు నిజానికి దయామయులుగా ఉంటారు.మిగిలిన ఐదుగురు దేవతలు శాంత స్వరూపులుగా కనిపిస్తారు.
దశమహావిద్యలు అని పేర్కొనబడిన పది మంది ఆదిపరాశక్తి అంశల యొక్క కథలు, మంత్రాలు మరియు ఆ దేవతల యొక్క స్వరూపాల గురించి నియమ బద్ధంగ పఠించినపుడు ఆయా మంత్రాల యొక్క అధిష్టాన దేవతలయిన దశమహావిద్యలు అనుగ్రహిస్తాయి.

దశమహావిద్యాధిపతి దేవతలు.......
మహాకాళి: 
దశమహావిద్యలలో మొదటగా పేర్కొన బడినది మహాకాళి. భయంకర ఆకారంతో, తంత్ర శాస్త్రంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది.
తార: 
తార, తాంత్రిక దేవతలలో అత్యంత శక్తివంతమైనది మరియు ఉగ్రమైనదిగా భావించబడుచున్నది.
ఛిన్నమస్త: 
దుర్గాదేవి యొక్క తాంత్రిక స్వరూపము, ఈమె రూపము అనేక లక్షణాలకు చిహ్నంగా కనిపిస్తుంది.
త్రిపుర సుందరి: 
మూడు లోకాలకు గాను ఈమె అత్యంత సౌందర్యవతి. ఈమె ఆదిమహావిద్యగా పేరుగాంచినది.
భువనేశ్వరి: 
భువనానికి అధినాయికగా ఈమెను పేర్కొంటారు. ఈ దేవతను పూజించిన వారికి సమస్త భయాలు తొలగిపోతాయి.
త్రిపురభైరవి: 
ఈ అవతారంలో ఆదిపరాశక్తి సృష్టి యొక్కలయకు ప్రతిరూపంగా ఉంటుంది.
ధూమవతి: 
దశమహావిద్యలలో అతి విచిత్రమైన అవతారం ఇది.ఈమె ఒక వితంతువుగా తంత్ర శాస్త్రంలో పేర్కొనబడినది.
బగలాముఖి: 
ఈ మహాశక్తి శత్రువుల యొక్క నాలుక బయటకు లాగి విసిరివేస్తుంది.
మాతంగి: 
సరస్వతీ దేవి యొక్క తాంత్రిక అవతారంగా మాతంగి పిలువబడుతుంది.
కమల: 
మహాలక్ష్మి కి మరోపేరే కమల అని గుర్తించాలి.

🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹

No comments:

Post a Comment