*:::::: మనస్సు గాయ పడటం :::::::::*
శరీరానికి గాయం అయితే కనపడుతుంది. నెప్పి పుడుతుంది. గాయం అవ్వాలంటే భౌతిక దాడి జరగాలి.
ఇవేవి లేకుండా మనస్సు కి గాయం ఎలా అవుతుంది. ??. తెలుసు కుందాము.
మనస్సు అంటే జ్ఞాపకాలు, జ్ఞానం, అనుభవాలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు, నమ్మకాలు, భావాలు, నిబద్దతలు, ఆశలు,కోరికలు, నేర్చు కున్న వి,
కట్టుకొన్న పేక మేడలు, ఏర్పరచు కున్న భద్రతా వలయాలు. ఇవన్నీ కలిసి, ఘనీభవించి,ఒక మానసిక శరీరం నిర్మించబడి అంతరంగం లో వుంటుంది.
ఈ మానసిక శరీరం అనే ముద్ర, బొమ్మె నేను.
ఎప్పుడైతే గూడు కట్టిన అభిప్రాయాలు, విశ్వాసాలు అభిప్రాయాలు మొదలు వాటికి భిన్నంగా, ఏదైనా మాట విన్నప్పుడు పని,సంఘటన జరిగినప్పుడు, ఈ మానసిక శరీరం గాయ పడుతుంది.
సింపుల్ గా అభిప్రాయ బేధం అనవచ్చు. దీనికి ఎమోషన్ జోడించ పడింది అలవాటుగా, అజ్ఞానంగా. అంతే...
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment