🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"480"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"నాలో పరిధిభావన పోయి కర్తృత్వం నశించాలంటే ఎలా ?"*
*"కర్తృత్వం అంటే నేను చేస్తున్నానని అనిపించటం. ఎదుటి వస్తువు లేకుండా ఏ పని చేయటం ఎవరికీ సాధ్యంకాదు. సంబంధం చేత ప్రతి అనుభవం సుఖదుఃఖాలను ఇస్తూనే ఉంది. సృష్టి అంతా సమిష్టి కర్మలుగా, అనుభవాలుగా ఉన్నప్పుడు అందులో ఎవరి ప్రమేయం ఉండదన్న సత్యం మనకి అర్థం కావాలి. అప్పుడే మనలో పరిధిభావం పోయి కర్తృత్వం నశిస్తుంది. అన్నం అరిగితే శక్తి వస్తుంది. అరగకుంటే అజీర్తి వస్తుంది. ఈ రెండు అనుభవాలు మనవే అయినా అవి అన్నం అనే మరొక వస్తువుతో ముడిపడి ఉన్నాయి. ఒక వ్యక్తి అన్నదానం చేయాలనుకున్నాడు. అందుకు ఆకలితో ఉన్న వ్యక్తితో పాటు అన్నదాత పండించిన బియ్యం కూడా కావాలి. అందులో ఏది లేకపోయినా తానొక్కడే అన్నదానం నిర్వహించలేడు. ఇలా సృష్టిలోని మరొక వ్యక్తి లేదా ప్రాణి లేదా వస్తువుపై ఆధారపడనిదే కర్మగానీ, అనుభవం గానీ లేదు. మనం ప్రతి పనిలోనూ మన ప్రమేయాన్ని ఆపాదించుకోవడం ఎంతవరకు సమంజసమో గమనించాలి !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment