💖💖💖
💖💖 *"493"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"ఉపాసన, ధ్యానాలు శివైక్య భావనకు ఏవిధంగా దోహదపడతాయి ?"*
*"ఉపాసన, ధ్యానాలు రెండూ శివైక్యస్ధితికి ముందుండే పూర్వాంగాలని భగవాన్ శ్రీరమణమహర్షి చెప్పారు. శివైక్యస్ధితినే భగవాన్ మౌనం అన్నారు. ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం. ధ్యానం అంటే నిరంతరంగా తలుచుకోవడం. శివ దీక్షలో భక్తుడు తన మెడలో ధరించే శివచిహ్నం అతనితో ఉపాసన, ధ్యానాలను చేయిస్తుంది. తాను శివుడికి దగ్గరగా ఉన్నానన్న భావన అతని తద్వారా కలుగుతుంది. అదే ఉపాసన. ఏది చేస్తున్నా, చూస్తున్నా, తింటున్నా, మాట్లాడుతున్నా తను మెడలోని ఆ 'శివచిహ్నం' ద్వారా దైవం గుర్తుకొస్తుంది. అలా గుర్తుకు రావటమే ధ్యానం. ఒకే ధ్యాసలో ఉండటం ధ్యానం. మనసు దేనిపై ఉందో అదే మన ధ్యాస అవుతుంది. మనసు ఒక విషయంపైన లేదా ఒకే వస్తువుపైన ఉంటే అది ధ్యానమే. ఆ భావనతో చేసే శివదీక్ష సాధకుని మౌనంలోకి తీసుకెళ్తుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment