Thursday, March 23, 2023

శివదీక్ష ద్వారా భక్తుడు కొత్తగా పొందేది ఏమిటి ?

 💖💖💖
       💖💖 *"495"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"శివదీక్ష ద్వారా భక్తుడు కొత్తగా పొందేది ఏమిటి ?"*

*"పరమవస్తువు వైపు సాగే అంతర్ ప్రయాణమే శివదీక్ష. శివస్తుతిలో నమః జేష్టాయచ - నమః కనిష్టాయచ అని చదువుతాం. అంటే ఇంట్లో ఉన్న వయో వృద్ధుడైన తాతయ్య శివుడే. ఆ ఇంటి కోడలి కడుపులో పిండంగా ఉన్న శిశువు కూడా శివుడే. దైవం కాని వ్యక్తి, వస్తువూ లేదని చెప్పడమే దీని భావం. మన నుండి దూరంగా ఉన్న ప్రాపంచిక వస్తువులపై కలిగే మోహాన్ని వధించేది శివుడే. ఆ మోహానికి కారణంగా మనలోనే అంటిపెట్టుకున్న అరిషడ్వార్గాలను వధించేది కూడా శివుడే. అన్నింటితో ఉంటూనే ఒకానొక పరమవస్తువువైపు సాగే అంతర్ ప్రయాణమే శివదీక్ష ! ఈ అవగాహన కలిగించేది శివదీక్ష !!"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

No comments:

Post a Comment