*పాపానికి, పాతకానికి ఉన్న తేడా ఏమిటి ?*
పాపము అనారోగ్య రూపముగా బాధిస్తుంది. ఆ బాధను అనుభవిస్తే పాపం పోతుంది.
పాపముతో పాటుగా పుణ్యం కూడా ఉంటే అనారోగ్యం ఉన్నప్పటికీ చేయవలసిన మంచి కార్యానికి ఆటంకం లేకుండా చేయగలుగుతాము. ఉదాహరణకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనుకున్న రోజు పాపం ఫలితంగా జ్వరం వచ్చినప్పటికీ, ఏ ఆటంకం లేకుండా వ్రతాన్ని పూర్తి చేయటం పుణ్యఫలితం.
పాపం ఫలితంగా కష్టాలు, అడ్డంకులు వస్తాయే కానీ శరీరం పడిపోదు.
కానీ పాతకం ఫలితంగా శరీరం పడిపోతుంది, పంచ మహా పాతకాలు.. బ్రహ్మ హత్య, బంగారాన్ని దొంగిలించటం. కల్లు త్రాగటం , పరస్త్రీని వాన్చించటం, ఈ నాలుగు పాతకాలలో ఒకటి గాని, నాలుగు గాని చేసిన వారితో స్నేహం చేయటం లాంటివి చేస్తే పాతకం చుట్టుకుంటుంది.
మరి తేరుకోవడం కష్టం,
అందుకు జాగ్రత్త గా వుండాలని శాస్త్రాలు చెబుతున్నాయి...
No comments:
Post a Comment