Thursday, March 23, 2023

ఆలోచనలు ఏవీ లేనప్పుడు మనసు కూడా లేనట్లేనా?

 💖💖💖
       💖💖 *"497"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ఆలోచనలు ఏవీ లేనప్పుడు మనసు కూడా లేనట్లేనా ?"*

*"మనసు అనేదానికి ఆలోచన తప్ప మరొక రూపంలేదు. నా మనసులో ఆంజనేయస్వామి ఉన్నారంటే, నా ఆలోచనలు ఆంజనేయస్వామి గురించి ఉన్నాయని అర్ధం. మనసనేది ప్రత్యేకించి ఏదీలేదు. ఆ మనసులో ఉన్న విషయమే మనసుకు ఉనికిని, రూపాన్ని కల్పిస్తుంది. శివాలయానికి వెళ్ళాలి అనిపిస్తే మనసు శివాలయంగా ఉన్నట్లు అర్ధం. ఏది ఇప్పుడు మన ఆలోచనగా ఉందో అదే మన మనస్సు ! ఏది ఇప్పుడు మన మనసులో ఉందో అదే మన ఆలోచన. మనసు-ఆలోచన రెండిటికీ బేధంలేదు. కాబట్టి మౌనంలో మనసు పోతుందంటే అర్ధం ఆలోచనలు పోవటమే !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment