Friday, March 10, 2023

నేను ఆచరించే కర్మలేనా, ఉనికి విషయాల్లో కూడా నా ప్రమేయం లేదంటారా ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"481"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"నేను ఆచరించే కర్మలేనా, ఉనికి విషయాల్లో కూడా నా ప్రమేయం లేదంటారా ?"*

*"మన జీవితం అంతా ఎడ్లబండి ప్రయాణం లాంటిది. ఎడ్లు, బండి, మనిషి ఉంటేనే ప్రయాణం అనే క్రియకు అవకాశం ఉంటుంది. ఒక్కరే నడిచి వెళ్ళాలన్నా గమ్యం అనే రెండో విషయం లేకుండా ప్రయాణం కుదరదు. మన కర్మలే కాదు మన ఉనికి విషయంలో కూడా మన ప్రమేయంలేదు. మన రూపం, అందం, చదువు, సామర్థ్యం ఏది చూసుకున్నా అవి ఏర్పడిన తర్వాతనే వాటికి మెరుగులు దిద్దగలుగుతున్నాం. చదువు అబ్బనివాడు ఐఏఎస్ చదవలేడు. అందం, నటనా సామర్ధ్యం లేని వనిత నటి కాలేదు. ఎత్తు తక్కువగా ఉన్న వ్యక్తిని మిలటరీలోకి అనుమతించరు. అంటే మనకు లభించిన లక్షణాలకు లోబడే మన కదలిక ఉంటుందని అర్థమవుతుంది. మరి ఆ లక్షణాలు తాను సాధించుకున్నవి కావు. ఏర్పడిన వాటినే మన జీవితానికి అనుగుణంగా మలుచుకుంటున్నాం. తాను గాని తన తల్లిదండ్రులు గాని ప్రణాళిక వేసుకొని సంతానాన్ని తయారు చేయలేదు. ఉన్న లక్షణాలను నైపుణ్యాలతో వృద్ధి చేసుకోవటమే మన చేతిలో ఉంది. కాబట్టి దేనికీ మనం గర్వపడటంగానీ, న్యూనత పడటంగానీ అక్కరలేదు !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
          

No comments:

Post a Comment