🔥అనవసరమైన జ్ఞాపకాలు.....🔥
🌹🌹🌹🌹🌹🌹🌹
మనసుకి స్పందన, ప్రతిక్రియ అనే రెండు లక్షణాలు ఉన్నాయి. కాలులో ముల్లు గుచ్చుకుంటే అబ్బా అనటం స్పందన. అది నాకే గుచ్చుకోవాలా అని అనుకోవటం, మళ్ళీ గుచ్చుకోకుండా జాగ్రత్త పడటం ప్రతిక్రియ. ఎవరైనా తిట్టినప్పుడు బాధ కలగటం స్పందన. వాళ్ళు ఎదురు పడగానే కలిగే క్రోధం ప్రతిక్రియ.
మన ప్రతిక్రియలకు జ్ఞాపకాలే కారణం. అనవసర జ్ఞాపకాలు తగ్గటమే మన మనసుకు బలం. మనసుకు బలాన్నివ్వటమే దివ్యత్వం. దానికి నిరంతర ఈశ్వరుని నామ జపమే సులభ సాధన. దీని వల్ల జ్ఞాపకాలు పూర్తిగా పోవు. కానీ నీరశించిపోతాయి. ఆలోచనలు పూర్తిగా ఆపటం సాధ్యం కాదు. అనవసర ఆలోచనలు తగ్గించటమే మన ముందున్న సాధన...
* అన్వేషణ *
*లావోట్జు ఇలా అన్నాడు, 'అన్వేషించడం వలన మీరు కోల్పోతారు. వెతకకండి, మీరు కనుగొంటారు. ఇది ఇప్పటివరకు చేసిన అత్యంత ముఖ్యమైన ప్రకటనలలో ఒకటి. అన్వేషణలోనే మీరు తప్పిపోతున్నారు. *
*మీరు కోరుకోవడం అంటే, మీరు తప్పు దృక్పథాన్ని తీసుకున్నారు. వెతకడంలోనే మీరు ఒక విషయాన్ని అంగీకరించారు - మీరు కోరుకునేది మీ వద్ద లేదు. తప్పు ఎక్కడుంది. నీ దగ్గర ఉంది. ఎందుకంటే వెతుకుతున్నది మీరు ఇప్పటికే కలిగి ఉన్నారు. మీరు ఏదైనా వెతకడం ప్రారంభించిన క్షణం, మీరు అయోమయానికి గురవుతారు.ఎందుకంటే మీరు దానిని కనుగొనలేరు - ఎక్కడా చూడలేరు, ఎందుకంటే అది ఇప్పటికే ఉంది. ఇది కంటి అద్దాల కోసం వెతుకుతున్న మనిషిలా ఉంది. అతని కళ్ళద్దాలు అప్పటికే అతని కళ్ళ మీద, ముక్కు మీద ఉన్నాయి, కానీ అతను ఆ గాజులలోంచి వెతుకుతున్నాడు! ఇప్పుడు అతను వాటిని ఎప్పటికీ కనుగొనలేడు, అతను అన్ని శోధనలు వ్యర్థమని గుర్తుంచుకుంటే తప్ప.*
*'నేను చూడగలిగితే, నా కళ్ళద్దాలు నా కళ్ళ ముందు ఉండాలి, లేకపోతే నేను ఎలా చూడగలను?' అని గుర్తు తెచ్చుకోవాలి. మనం చూడటంలోనే నిజం దాగి ఉంది. మన శోధనలోనే నిధి దాగి ఉంది. అన్వేషకుడు కోరినవాడు ఒకటే. అదే సమస్య. మానవులు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ఏకైక సమస్య మరియు దాని గురించి వారు మరింత అయోమయంలో పడ్డారు. తెలివిగల వైఖరి లావోట్జుది. వెతకడం మానేసి ఉండు’ అంటాడు. ఉండండి, మరియు మీరు ఆశ్చర్యపోతారు. మీరు దానిని కనుగొంటారు...
నేను’ను వదిలించుకుంటే.. ఆత్మ స్వేచ్ఛావిహంగమే
ఆత్మ నిత్యమైనది, సత్యమైనది, పవిత్రమైనది. నిత్యంగా, సత్యంగా, సమర్చనంగా ప్రకాశించే పరమాత్మ స్వరూపం. జీవితంలో ప్రతి అడుగునూ నియమానుసారంగా దైవంవైపు చేరే విధంగా వేయడమే గొప్ప ఆత్మసాధన. కానీ.. నేను అనే పంజరంలో మనని మనం బంధించుకుని, కుదించుకుని, నియంత్రించుకుని ఆ ఇరుకు గది అస్థిపంజరమే ప్రపంచంగా బతికేస్తున్నాం.
ఆ ‘నేను’ అనే అహాన్ని వదిలించుకుంటే, మనని మనం ఆ పంజరం నుంచి విడుదల చేసుకుంటే ఆత్మ స్వేచ్ఛా విహంగమై అనుభవ ఆకాశంలో హాయిగా విహరించగలదు. అలా కాకుండా.. ‘నేను’పై మమకారంతో ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని, అనురక్తిని కనబరుస్తూ దైహిక సుఖాలు తీర్చుకోవడంలోనే తన్మయం చెందడం అల్పత్వం. అరిషడ్వర్గాలను జయించగలిగితేనే సామాన్యుడు మాన్యుడవుతాడు. తనలో కలిగే కామం తాత్కాలిక సుఖాన్నిచ్చేదేగానీ.. శాశ్వత సుఖాలను మార్గదర్శనం చేయించేది కాదని మానవుడు గ్రహించాలి. ప్రతివారి జీవితంలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో విషాదం తప్పదు. మన బాధను భగవంతుడికి మొరపెట్టుకుని కష్టాల నుంచి రక్షించమని కోరడం ఆత్మఘోష. లోపలి కల్మషాలను కడిగివేసేది ఆత్మధ్యానం.
అది మనిషిలోని అహంకారాన్ని ఆవిరైపోయేట్టు చేస్తుంది. ఆనంద జగత్తులోకి తీసుకెళ్లి ఓలలాడిస్తుంది. ఎన్నికష్టాలు వచ్చినా ఆత్మహత్య భావన కలగకుండటమే ఆత్మస్థైర్యం. జీవితంలో కష్టసుఖాలు వాననీటిలో బుడగలవంటివి. కష్టం వచ్చినప్పుడు బాధ.. సుఖం వచ్చినప్పుడు సంతోషం కలగడం సహజం. ఆ కష్టసుఖాలు రెండూ దైవం ఏర్పరచినవే. దీన్ని గ్రహించి.. కష్టాల్లో సైతం ఆత్మస్థైర్యాన్ని కోల్పోనివారే ఆత్మనిగ్రహం కలిగినవారు..
ఆదిత్యనారాయణ..
తను ఒక్కడే బాగుండాలి అనే ఆలోచన నుండి అందరూ బాగుండాలి అనే కోరికవైపునకు మన మనసును మళ్లించి అందుకు తగ్గ కృషి చేయడమే ఆత్మపరిశీలనం. ఈ లోకంలో గమనం కూడా గమ్యమంత ఆనందాన్నిచ్చే పయనం ఒకటుంది. అదే ఆధ్యాత్మిక ప్రయాణం. ముక్తిమార్గం.. సాధనాపథం. ఆత్మ సూర్యుడైతే.. మన స్వభావాలు ఆ సూర్యుణ్ని కప్పివేసే మేఘాలవంటివి. వాటికి అతీతంగా చూడగలిగితే ప్రకాశించే అందరి ఆత్మలూ ఒక్కటేనన్న అవగాహన కలుగుతుంది. ఆత్మకు అంటుకున్న మలినాలను తొలగిస్తే భగవత్ స్వరూపం స్వయంప్రకాశంతో సాక్షాత్కరిస్తుంది...
"'కన్ను తెరిస్తే జీవితం. కన్ను మూస్తే మరణం!ఈ మధ్యకాలంలో వున్న జీవితాన్ని సుఖ శాంతులతో గడుపు కోవటం ఒక కళ. మనిషి జీవించి ఉన్నప్పుడు ఎన్ని వాహనాలెక్కినా, చివరికి ఏనుగు అంబరీ నెక్కినా ఆఖరికి ఎక్కవలసింది నలుగురు భుజాల పైకి. ఈ సత్యాన్ని తెలుసుకొంటే రాగం లేదు, ద్వేషం లేదు, మోహం అంత
కంటే లేదు.ఇదే సనాతన ధర్మ ప్రభోదం. మహర్షుల ఉపదేశ సారం...
చిన్ముద్ర.....
మానవుని చేతికి ఐదు వ్రేళ్ళుంటాయి. నాలుగు కలిసే ఉంటాయి. ఒకటి మాత్రం దూరంగా ఉంటుంది. అది పరమాత్మ. మిగిలిన ఈ నాలుగు వ్రేళ్ళలో చూపుడు వ్రేలు జీవుడు. మిగిలిన మూడు వ్రేళ్ళు, మూడు గుణాలు.
జీవుడెప్పుడూ మూడు గుణాలతో కూడియే ఉంటాడు. అందుకే నాలుగు వ్రేళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటాయి. అయితే ప్రయత్నంతో చూపుడు వ్రేలు అనబడే జీవుడు ని మిగిలిన మూడు వ్రేళ్ళు అనే మూడు గుణాలకు దూరంగా జరిపితే.. పరమాత్మ అనే బొటన వ్రేలితో కలసిపోతాడు.
ఇలా చూపుడు వ్రేలు, బొటన వ్రేలు కలిసి సున్నాగా ఏర్పచితే అదే "చిన్ముద్ర". ఆలయాల్లో దేవతా విగ్రహాలు చూపే చిన్ముద్ర లోని ఆంతర్యం ఇదే... మూడు గుణాలను వదిలించుకొని నాతో ఐక్యం కండి అని చెప్పటమే...
🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹
.
No comments:
Post a Comment