Friday, March 10, 2023

కర్తృత్వ భావన పోగొట్టుకునేందుకు ఏమిచేయాలో సెలవివ్వండి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"484"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"కర్తృత్వ భావన పోగొట్టుకునేందుకు ఏమిచేయాలో సెలవివ్వండి ?"*

*"కర్తృత్వభావన పోవటానికి కర్త ఎవరనేది విచారించాలి. అంతరంగంలో వెతికితే కర్తృత్వభావన పోతుంది. మనగాను, ఏర్పడుతున్న సంఘటనలుగానూ ఉన్నది దైవమే. మనవైపు నుండి కర్తృత్వాన్ని తగ్గించుకుంటే, ప్రతి సంఘటనలోనూ మనకు దైవమే కనిపిస్తుంది. అప్పుడు  ఏ అనుభవం మనని బాధించదు. ఈ సృష్టిలో కర్మలు, సంఘటనలు, అనుభవాలు సత్యంగా ఉన్నాయనేది వాటితో మనకున్న సంబంధం. మన ఏర్పరుచుకునే కర్తృత్వం మాత్రం అసత్యంగా ఉంది. అందరిలో, అన్నింటిలో ఉన్న వస్తువు ఒక్కటైనా ఏర్పడిన పరిధిలో తేడాలే అన్ని కర్మలకు కారణమన్న వాస్తవం మనకు అర్థమైన రోజు కర్తృత్వభావన  నశించి పరమశాంతి లభిస్తుంది. కర్తృత్వ భావన వేర్లు లాగేస్తే ఫలాలు రాలిపోతాయి. కాబట్టి చేస్తున్నది నేనన్న భావన మానుకోవాలి. అప్పుడు నానాత్వం మాయమవుతుంది. సారసత్వం మిగులుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

No comments:

Post a Comment