🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"486"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మౌనదీక్ష చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారా ?"*
*"మౌనమే అత్యుత్తమ దీక్ష అని భగవాన్ శ్రీరమణమహర్షి అన్నారు అంటే మిగిలిన సాధనలన్నీ తిరస్కరించమని కాదు. వాటినే పరమావధిగా భావించి అక్కడే ఆగిపోవద్దని మహర్షి బోధ. విజయవాడ వెళ్ళదలుచుకున్న వారికి అక్కడికి చేరుకోవడం దీక్ష. బస్సు ఎక్కటం, ప్రయాణించటం ఇవన్నీ ఆ దీక్షకు ఉపకరించే విషయాలు మాత్రమే కానీ అవి దీక్ష కాదు. అలాగే సాధనలో ఏ దీక్ష అయినా లక్ష్యంగా ఎంచుకున్న ఆ ఫలం కోసమే. దీక్షలోని మిగిలిన ప్రక్రియలన్నీ ఆ ఫలాన్ని పదేపదే గుర్తుకు తెచ్చేందుకే. మనం ధరించే ప్రత్యేక దుస్తులు కానీ మాలలు కానీ జపించే మంత్రంగాని చేసే ధ్యానంగాని దీక్షకు ఉపకరణాలు మాత్రమే. ఏ మార్గంలోనైనా అందరూ కోరుకునేది మనసు ఆగితే లభించే శాంతినే !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment