*_జీవితంలో గెలవవచ్చు కానీ, గర్వపడకూడదు. భయపడవచ్చు కానీ, పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ, కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ, విసిగిపోకూడదు. ఎందుకంటే జీవితం అన్నాక అన్ని ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి కానీ,భయపడి కూలబడకూడదు._*
*_మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే కన్నా - మన గురించి మనం ఏమి ఆలోచిస్తున్నాం, ఏమనుకుంటున్నాము అనేది ముఖ్యం._*
*_ఎందుకంటే, మన జీవితం మనది మనకు వచ్చే కష్టనష్టాలు మనమే భరించాలి. చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ, తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది._*
*_జీవితంలో బంధాలు, అనుబంధాలు నీటి మీద రాతలే. ధనం,ఆస్తుల ముందు అన్ని దిగదుడుపే._*
*_నిన్నటిదాకా మీరే అంతా.. అన్నవారు,నేడు ఒక్కసారిగా మీరు ఎవరు...?అని అనవచ్చు._*
*_అవసరానికి మనల్ని వాడుకున్న వారే రేపు మనకు వెన్నుపోటు పొడవవచ్చు._*
*_మనల్ని దేవుడు, దేవతలు అన్నవారే అవసరం తీరాక గుండెను ముక్కలు చేయవచ్చు._*
*_ఏమైనా జరగొచ్చు. ఎందుకంటే పోయేటప్పుడు తన వెంట రాని ధనానికి జనం దాసోహం అయ్యారు. ప్రపంచంలో వేగంగా మారేది (మనిషి) "మనసు "మాత్రమే. ఇప్పుడు ఎవరి గుండెను వాళ్ళు వెన్నుపోటుల నుండి కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది జాగ్రత్త మిత్రమా.. ☝️_*
*_✍️మీ... డా,, తుకారం జాదవ్.🙏_*
_ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్._
*_Cell : 7382583095._*
No comments:
Post a Comment