Thursday, March 9, 2023

కీర్తిముఖ

 


ఇక్కడ కనిపించే రూపం పేరు "కీర్తిముఖ" రాహువుని చంపడానికి.. శివుడి మూడో కన్ను నుండి పుట్టిన ఒక భయంకరమైన అవతారం.

శివానుగ్రహం పొందడం చేత శివాలయాల, శివానుబంధ ఆలయాల గోపురాలపై ఉంటుంది. కీర్తిముఖ అనగా "మహిమ గల ముఖం" అని అర్థం.

తన శరీరాన్ని తానే తిని.. చివరకు ఈ ముఖం మాత్రమే మిగులుతుంది.

అసలు కథలోకి వెళ్తే...

స్కాందపురాణం 17th chapter ప్రకారం, "ఒకానొక సమయంలో దైత్యుల రాజు జలంధరుడు ఉండేవాడు. అతను మూడు లోకాలను జయించగలిగిన రాజు.

అదే సమయంలో హిమవంతుని కుమార్తె పార్వతిదేవిని శివుడు పెళ్ళి చేసుకోవడానికి సమాయత్తవుతున్నడు.

శివుడు ఒక భిక్షగాడు, అడుక్కునే వాడు.. అతనికి ఈ అందాల రాశి, సుందరాంగి అయిన పార్వతి ఎందుకు అని భావించిన జలంధరుడు, తన దూత రాహును శివుని వద్దకు పంపి, "పార్వతిదేవి మా రాజు (జలంధరుడు) కోసం ఉంది, అతను పెళ్ళి చేసుకుంటాడు.." అని చెప్పమంటాడు. రాహు ఆ విధంగానే చెప్తాడు శివుడితో...

అది విన్న శివుడు, ఆగ్రహం చెందడం ద్వారా.. తన మూడో కంటి నుండి ఒక విచిత్ర ఆకృతి రూపంతో (సింహం ముఖం కలిగి, నరుని దేహం వలె.. ఇంకొక విధంగా చెప్పాలంటే, నరసింహ అవతారం పోలి ఉండే..) రూపంతో పెద్ద నాలుకతో, భయానక కళ్ళతో.. రాహును తినడానికి వెంటపడతాడు.

అది గ్రహించి, తప్పైపోయిందని.. శివుణ్ణి కోరతాడు రాహు, దానికి సంతోషించి శివుడు అనుగ్రహిస్తాడు.

కానీ, శివుని మూడో నేత్రం నుంచి వచ్చిన ఈ రూపం మాత్రం తీవ్ర ఆకలితో ఉంటుంది.

ఇప్పుడు ఆ ఆకలి తీరడానికి.. శివుడు, ఆదేశానుసారం.. తన శరీరాన్నే తాను తినమని చెప్తాడు.. అలా, తన శరీరాన్నే తాను తింటాడు.. చివరగా ముఖం మాత్రమే మిగులుతుంది.

ఆ మిగిలిన ముఖానికి, "కీర్తిముఖ" అని పేరు పెట్టి.. తన ఆలయాల ద్వారా బంధాల దగ్గర, గోపురాల మీద ఉండే వరమిస్తాడు. 

కీర్తిముఖ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు, జలంధరుడు మరియు రాహు గురించి కూడా ప్రస్తావిస్తారు.

ఇకపోతే మన గృహం యొక్క సింహ ద్వారానికి, గుమ్మం పైన ఈ కీర్తిముఖ పటం పెట్టుకుంటే కూడా, చీడపీడలు, దుష్ట శక్తుల ప్రభావం ఆ ఇంటి మీద ఉండదు పైగా ఆ ఇంటికి చాలా మంచిదని వాస్తు శాస్త్రం చెప్తుంది అంటారు పెద్దలు.

#ఓంనమఃశివాయॐ🙏🚩

No comments:

Post a Comment