*అహంకారం*
✍️ నన్నయ వాణి
💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫
🪷 ఒక పక్షి చిన్న మాంసంముక్కను పట్టుకొని ఆకాశంలో ఎగురుతోంది. మరికొన్ని పక్షులు తనని వెంబడిస్తూ వేగంగా రావడంచూసింది. మాంసం ముక్కను క్రిందికి వదిలెయ్యగానే పక్షులు దానివెంబడి క్రిందికి వెళ్ళిపోవటం గమనించి... *'మాంసం ముక్కను వదులు కోవటం వలన ఆకాశంలో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎగిరే అవకాశం కలిగిందని సంతోషపడింది.'*
✅ *బహుశా అహంకారాన్ని వదులుకోవటం వల్లనే గొప్ప స్వేచ్చని, ప్రశాంతతను పొందగలుగుతామేమో! ఎప్పుడో ఒకప్పుడు ఈ అహంకార దశను దాటటంకూడా అవసరమే.*
🪷 అహంకారం పొగరుబోతుతనాన్ని పెంచి పోషిస్తుంది. నోటికి ఏమొస్తే అది మాట్లాడిస్తుంది. విలువైన సంబంధబాంధవ్యాలను కూడా వదులుకునేలా చేస్తుంది. ఒకటిమాత్రం నిజం. దానివలన కోల్పోయిన వాటికి అహంకారం ఎప్పుడూ సమానమైతే మాత్రంకాదు.
🪷 పైగా, అహంకారానికి ఒక స్వభావం ఉంది. దానికి రోజూ మేతకావాలి. ఇతరులను తిట్టటం, నోటికొచ్చినట్లు మాట్లాడటం, మేలుచేసినవారికే కీడుతలపెట్టటం, వాడెంత, వీడెంత అనటం, కొడతా, కొట్టిస్తాననటం వంటివి.. ఆహారానికి విపరీతంగా అందించాలి. తామే గొప్పవాళ్ళమని, అధికులమని దానితో ఘర్షణ పడుతుండాలి.
🪷 ఒకవేళ అహంకారానికి తిండి పెట్టకపోతే, మౌనం వహిస్తే ఆత్మన్యూనతాభావంతో, తాము తగ్గిపోతున్నామనే కసితో, అభద్రతతో బాధపడాల్సివస్తుంది. ఎలాచూసినా దానికున్న శక్తి ఏమిటంటే మనశ్శాంతిని దోచుకోవటం. మానసికంగా మనుషులమీద కసిని పెంచుకోవటం.
✅ *ఇదంతా... ఏదోఒకరోజు శరీరం శాశ్వత విశ్రాంతిని తీసుకునే వరకు. అది ఎవరికైనా ఎలాగూతప్పదు.*
🪷 అహంకారాన్ని పెంచిపోషించుకునేవాడికి తల్లి దండ్రులు, తోడబుట్టినవాళ్ళు, బంధుమిత్రులు అని ఏదీ ఉండదు. ఒక్కొక్కక్షణం భారమై, ప్రతి పరిస్థితివల్ల, మనిషి వల్ల ఒత్తిడిని పొందుతూ శరీరం, మనసు నిత్యం నిప్పుల మీద నడుస్తూ ఉంటుంది.
🪷 అహంకారం మొదలైతే అన్నీ వెళ్లిపోతాయి. అందరూ దూరమౌతారు. అది వెళ్ళిపోతే అన్నీ వెనక్కి వస్తాయి. ఇంతే లాజిక్. ఏది స్వీకరించాలి, ఏది వదులు కోవాలనేది మనిషి వివేచనమీద ఆధారపడి ఉంటుంది.
🪷 అహంకారం ఒక మానసిక వ్యాధి. మనో విజ్ఞాన శాస్త్రంలో దానిమీద చాలాపరిశోధనలు జరిగాయి. కొందరు ఈ వ్యాధిని బయటికి కనిపించకుండా కృత్రిమమైన నవ్వు మొహంతో కప్పుతారు. దీనికి ఔషధాలు కూడా ఏమీలేవు. శ్రీ చాగంటి, గరికిపాటి, సామవేదం వంటి వారి ఉపన్యాసాలు కూడా ఈ వ్యాధిని తగ్గించలేవు.
✅ *ఒక్కటిమాత్రం గుర్తు పెట్టుకోండి. అహంకారాన్ని వదులుకోని వారిని మనమే వదిలెయ్యాలి. దానివల్ల మనం ప్రశాంతంగా ఉంటాం. ఆనందంగా, అందంగా జీవించగలుగుతాం. అది మనచేతుల్లోనే ఉంది. అహంకారాన్ని వదిలేయటం అవతలివారికి చేతకానప్పుడు అహంకారులను వదిలెయ్యటం మనచేతుల్లో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలు.* ✅
*Courtesy:* సేవా సంక్రాంతి
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*
*సేకరణ:*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈
No comments:
Post a Comment