Thursday, March 9, 2023

::::: శ్వాస పట్ల సతి మన జీవితాన్ని మార్చి* *వేస్తుంది :::::

 *::: శ్వాస పట్ల సతి మన జీవితాన్ని మార్చి*   
           *వేస్తుంది ::::*
    మనం పుట్టి పెరిగిన తీరులో మనకు తెలియకుండానే, మన గమనిక లోకి రాకుండనే , కొన్ని అనారోగ్యాలు మనలో జీర్ణం అయి మన  జీవితాన్ని నడిపిస్తూ వుంటాయి.
   అలాగే కొన్ని భయాలు, ఆందోళనలు ,మనలో పాతుకు పోయి మనం జీవితాన్ని శాసిస్తూ వుంటాయి.
     కొన్ని ఇష్టాలు, ద్వేషాలు, నమ్మకాలు మనలో దాగి మనం జీవితాన్ని మార్చేసినాయి.
     ఇవన్నీ మన జీవితం మీద చూపే ప్రభావంలో భాగంగా మన  శ్వాస నడకని తమకు అనుకూలంగా మార్చి వేసి నందున, మన శ్వాస నడిచే తీరు సహజ సిద్ధమైన, ఆరోగ్య కర మైన  రీతిలో లేదు.
     ఆనాపానసతి అని బుద్ధ భగవానుడు చెప్పిన ధ్యాన అభ్యాసం మన శ్వాస రీతిని సహజంగా చేస్తున్నందున ,
జీవితం గమనాన్ని మార్చిన  అనారోగ్యాలు,భయాలు, నమ్మకాలు, రాగ ద్వేషాలు పోయి ఆనందకర భౌతక జీవనం తిరిగి మనకు లభ్యం అవుతుంది.
 *షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment