☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే,
ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.
- మహాత్మగాంధీ
ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే,
పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.
- నెహ్రు
మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి, ఇక్కడ
పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.
- ఫెడ్రంట్ రసెల్
మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు, కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.
- ఆల్బర్ట్ ఐన్స్టెయిన్
ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు, జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు
-నెల్సన్ మండేలా
🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం,
📘 పుస్తకం అన్నారు .
- లెనిన్
పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు
పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు వచ్చి పడ్డాయంట, కానుకగా ఆ వ్యక్తి
- లెనిన్
📚 ఒక్కో చిత్రం నటించాక, తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు.
-చార్లీ చాప్లిన్
ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు.
- విన్స్టెన్ చర్చిల్
📚 భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు, పుస్తకాలని చెప్పారు.
-మార్టిన్ లుతెర్కింగ్
📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు, పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి.
- భగత్ సింగ్
📖 నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు.
- అబ్రహం లింకన్
📚 వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి,
అతడే నా మార్గదర్శి అన్నారు.
-జూలియస్ సీసర్
🌏 ప్రపంచపటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా, అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు.
-టెస్కార్డ్స్
📘 జీవితం విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు, ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు.
-ఇంగర్సాల్
🤸♀️వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో,
అలా 📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు.
-సిగ్మెంట్ ఫ్రాయిడ్
📕 పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని, పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు.
ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే
📒 ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.
📖చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి .📚సేకరణ మిత్రునివాట్సప్.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
No comments:
Post a Comment