💖💖💖
💖💖 *"488"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*'ఆత్మను సత్, చిత్, ఆనందం అని ఎందుకు అంటారు ?'"*
*"ఇప్పుడు మనం అసత్, అచిత్, అనానందంతో ఉన్నాం కాబట్టి భగవాన్ శ్రీరమణమహర్షి మాటల్లో ద్వైతాద్వైతాలు రెండు మనసుకే కానీ మనలోని ఆత్మకు కాదని స్పష్టమవుతుంది. మనం రోజూ పొందే నిద్ర మనకు తెలియకుండానే లభించే అద్వైత స్థితి. మెలకువ రావటమే మనం పొందుతున్న ద్వైత భావన. నిద్రలోనే కాదు, మనం రోజూ చేసే పనుల్లో లీనమైనప్పుడు కూడా మనకు తెలియకుండానే మౌనాన్ని పొందుతున్నాం. పనిలో మన ఉనికిని మర్చిపోవాలని, మనం ప్రయత్నం చేయటంలేదు. మనసు ఓకే ధ్యాసలో ఉండటం వల్ల ఆ స్థితి కలిగింది. కాబట్టి మనసును ప్రయత్న పూర్వకంగా ఓకే ధ్యాసలో ఉంచేందుకు అనేక విధానాలు అవలంబిస్తున్నాం. విధానాలు ఏవైనా మనసుకు మౌనం రావటం కోసమే. మనకు ఏ ధ్యాస లేనప్పుడు కలిగే స్థితి అదే !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment