*::::::::: వ్యక్తీకరణ. ::::::::::*
మనం మన ఆలోచనలను, భావాలను ఇతరులతో పంచుకుంటాము. దీనినే వ్యక్తీకరణ అనవచ్చు.
మనకు మనమే ఒకొక్క సారి చెప్పు కుంటాము.
ఇలా మనం వ్యక్తీకరించే టప్పుడు ఉద్వేగాలను కూడా జత చేస్తాము. ఎందుకంటే వ్యక్తీకరణ రసవత్తరంగా వుండటం కోసం.
ఇది అలవాటుగా మారి ఉద్వేగ పడకుండా వ్యక్తీకరణ చేయ లేకుండా వున్నాము.
దీని అర్ధం మన ఉద్వేగాలు చాలా మటుకు నేర్చు కున్నవి, అలవాటు చేసుకున్నవి.
వాస్తవాన్ని గ్రహించడానికి మరియి వ్యక్తీకరించడానికి ఉద్వేగాలు అవసరం లేదు.
యథాభూత జ్ఞాన దర్శనం లో ఉద్వేగాలకు చోటు లేదు. ఇదే ధ్యానం.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment