💐 మనకు మంచి *అనిపించింది* మాత్రమే చేయాలి..!! *కానీ* మంచి *అనిపించుకోవడం* కోసం చేయకూడదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ *స్థానం,స్థాయి* మారితే నిన్ను *మర్చిపోతారేమో* అయినా కూడా నువ్వు *నీలానే* ఉండాలి *స్థానం* మారినా *స్థాయి* మారినా అదే *వ్యక్తిత్వం* అంటే.
మన వల్ల *ఇబ్బంది* పడే వారికి మనం *దూరంగా* ఉండటం కూడా ఒక *రకంగా* వాళ్ళ *సంతోషానికి* మనం కారణం అవుతాం ఎందుకంటే *కలిసి* ఉండి ఇబ్బంది పెట్టడం కంటే *దూరంగా* ఉండి వాళ్ళని సంతోషము పెట్టడమే చాలా *మంచిది.*
ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది *గౌరవమే* దాన్ని సంపాదించుకోవాలే తప్ప *పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో* కొనుక్కోలేము ! ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా *ఉంటుంది* కానీ మనుష్యుల *నిజ ప్రవర్తన* అర్ధమౌతున్న ప్రతిసారి *క్రొత్తగా* కనపడుతుంటుంది..!
చెట్టును నరికేయడం చాలా *సులభం* కానీ అదే చెట్టు *పెరిగి, పెద్దది* కావాలంటే *జీవితకాలం* పడుతుంది..!! అలాగే *కోపంతో* ఒక *మాట* అనేయడం చాలా *సులభం*. కానీ *క్షణ* కాలంలో *జారే* ఆ మాట ఒక *బంధాన్ని* తెంచేస్తుంది.
🙏
No comments:
Post a Comment