Thursday, May 11, 2023

*అసలైన ఆరోగ్యానికి సిసలైన* *అవసరాలు.*

 *అసలైన ఆరోగ్యానికి సిసలైన*
                     *అవసరాలు.*
*≠≈≠≈≠≈≠≈≠≈≠≈≠≈≠≈≠≈≠≈≠≈≠≈≠*

*1. వెలుగొచ్చేవరకు పరుండటంమాని, వేకువ జామునే లేవడం "మంచిదను"!*

*2. బెడ్ కాఫీలు మాని, పరగడుపున ఎక్కువ మంచినీరు "మంచిదను"!*

*3. పేపరు పై మనస్సు మాని, సుఖవిరేచనం పై మనస్సు "మంచిదను"!*

*4. నడకే శ్రమ అనడం మాని, ఆసన ప్రాణాయాయాలు "మంచిదను"!*

*5. చెమట పట్టకుండా తినడం మాని, చెమట పడితేనే తినడం 'మంచిదను"!*

*6. వేడి నీరు స్నానం మాని, ఉదయం చన్నీళ్లు తలకు "మంచిదను"!*

*7. సబ్బులు, షాంపూలు మాని, గుడ్డతో చర్మం మర్దన "మంచిదను"!*

*8. పూరీలు, దోసెలు మాని, మొలకెత్తిన విత్తనాలు "మంచిదను"!*

*9. పచ్చి కొబ్బరిని కొవ్వు అనడం మాని, సంపూర్ణాహారం అనడం "మంచిదను"!*

*10. తినేటప్పుడు నీరు త్రాగడం మాని తినే అరగంట ముందు లీటరు నీరు త్రాగటం "మంచిదను"!*

*11. కష్టంగా జీర్ణమయ్యేవి రాత్రికి మాని, ఉదయం తినడం "మంచిదను"!*

*12 . ముత్యాల్లాంటి మర బియ్యం మాని, ముడి బియ్యం "మంచిదను'!*

*13. కూరలకు తొక్కలు తీయడం మాని తినడం "మంచిదను"!*

*14 . కూరలను వేయించడం మాని, కొద్దిగ ఉడక నివ్వడం "మంచిదను"!*

*15. కూరలలోని నీటిని వార్చడం మాని, త్రాగడం "మంచిదను"!*

*16. పచ్చికూరలు పడవు అనడం మాని, సహజారోగ్యానికి "మంచిదను"!*

*17. భోజనం చేసేటప్పుడు మాటలు మాని, మనస్సు పెట్టి తినడం "మంచిదను"!*

*18. అన్నంలో కూర కలపడం మాని, కూరలో అన్నం కలపడం "మంచిదను"!*

*19. ఆహారాన్ని నమలకుండా మ్రింగడం మాని, పదేపదే నమలడం "మంచిదను"!*

*20. భోజనం అయ్యాక నీరు మాని, భోజనం అరిగాక త్రాగడం "మంచిదను"!*

*21. పగటి పూట నిద్దర మాని, రాత్రికి గాఢ నిద్ర "మంచిదను"!*

*22. ఖరీదుగల హైబ్రీడు పళ్ళు తినడం మాని, సహజమైన పళ్ళు తినడం "మంచిదను"!*

*23. పళ్ళు రొంప అనడం మాని, రోగనిరోధకానికి "మంచిదను"!*

*24. పళ్ళలోని పిప్పి ఊసి వేయడం మాని, అది మింగడం "మంచిదను"!*

*25. రసాలను త్రాగడం మాని, నమలడం "మంచిదను"!*

*26. పనికి రాని కాలక్షేపం మాని, మనస్సుకు దైవ చింతన "మంచిదను"!*

*27. గదులలో మగ్గడం మాని, ఎండ తగలడం రోగనిరోధకానికి "మంచిదను'!*

*28. ఫ్యాన్లు, ఏ.సి.లు మాని, చెమట పడితే ఆరోగ్యానికి "మంచిదను"!*

*29. పలుమార్లు విరేచనం బలహీనమని మాని, 3,4 సార్లు సాఫీగా అవడం "మంచిదను"!*

*30. పైకి పౌడర్లు, అత్తరు పూత మాని, రెండు పూటలా స్నానం "మంచిదను"!*

*31. పొద్దుపోయాక భోజనం మాని, పొద్దు ఉండగానే భోజనం "మంచిదను"!*

*32. ఉన్నదని తినడం మాని, శ్రమకు తగిన తిండి "మంచిదను"!*

*33. రాత్రికి పీకల దాకా తినడం మాని, ఫ్రీగా తినడం "మంచిదను"!*

*34. రాత్రికి సినిమాలు, షికార్లు మాని, సత్ సాంగత్యము "మంచిదను"!*

*35. తిని పడుకోవడం మాని, అరిగాక పడుకోవడం "మంచిదను"!*

*36. కృత్రిమమైన ఆహారాలు మాని, సహజ దేహానికి సహజాహారం "మంచిదను"!*

*37. ఫ్రిజ్ ల వాడకం మాని పళ్ళు, కూరలకు గాలి, వెలుతురు "మంచిదను"!*

*38. రోజూ బీరు, కూల్ డ్రింక్స్ మాని, కనీసం 6 లీటర్ల మంచినీరు "మంచిదను"!*

*39. ముప్పు తెచ్చే ఉప్పును తాకటం మాని ఆహారంలో ఉన్న ఉప్పే ఆరోగ్యానికి "మంచిదను"!*

*40. కఫాన్ని పెంచే పంచదార, బెల్లాలు మాని, అన్ని విధాలా తేనె వాడటం "మంచిదను"!*

*41. చింతపండు వాడకం మాని, పచ్చి చింతకాయ వాడకం "మంచిదను"!*

*42. ఎండు మిర్చిని వాడడం మాని, గుణాలు గల పచ్చి మిర్చి "మంచిదను"!*

*43. అపకారం చేసే నూనె, నేతులు మాని, నేటి కాలానికి ఇది "మంచిదను"!*

*44. మషాలాలు ఆహారంలో మాని, మందుగా వాడటం "మంచిదను"!*

*45. చీటికి మాటికి మందులు మాని, అత్యవసరానికి "మంచిదను"!*

*46. రుచులతో రోజూ తినడం మాని, పెళ్ళి పండుగులకు మాత్రమే "మంచిదను"!*

*47. జీవాలను తినడం మాని, సత్వాన్నిచ్చే సాత్విక భోజనం "మంచిదను"!*

*48. "రుచులను తిననివాడు మనిషా" అనడం మాని, మనిషి అదుపులో రుచి "మంచిదను"!*

*49. రోగాలు లేవని రుచులను తినడం మాని, రోగాలు రాకుండా ఆహారం తినడం "మంచిదను"!*

*50. రోగం వచ్చాక తినడం మాని, ఉపవాసం చెయ్యడం "మంచిదను"!*

*51. ఆకలి లేనప్పుడు ఆహారం మాని, నీరు త్రాగడం మరీ "మంచిదను"!*

*52. "ఛీ! ఎనిమా" అనడం మాని, రోగానికి ఎనిమా "మంచిదను"!*

*53. ప్రకృతి వికృతి చేయడం మాని, ప్రకృతి ఆరోగ్యానికి "మంచిదను"!*

*54. రోగం తగ్గే వరకే ప్రకృతి చేయడం మాని, జీవితకాలం ఆచరించడం "మంచిదను"!*

*55. బాధ్యతలు తీరే వరకు బ్రతికితే చాలు అనడం మాని, 100 సంవత్సరాలు బ్రతకాలని కోరడం "మంచిదను"!*

*56. అసంతృప్తిని మాని, తృప్తి ఆరోగ్యానికి "మంచిదను"!*

*57. కోపం, ఈర్ష్య, చిరాకులు మాని, శాంతం ఆరోగ్యానికి "మంచిదను"!*

*58. ఎదుటవారితో చేయించుకోవడం మాని, మన పని మనమే చేసుకోవడం "మంచిదను"!*

*59. సాటివారిని ద్వేషించడం మాని, ప్రేమించడం ఆరోగ్యానికి "మంచిదను"!*

*60. ప్రకృతి విధానాన్ని వైద్యం అనడం మాని, జీవన విధానం అనడం "మంచిదను"!!*

                   🍁🙏🍁

         *ఆరోగ్యమే మహోభాగ్యం* 
  *పలువురికి పంచడమే పరమార్థం*
                   *పుణ్యప్రదం*

No comments:

Post a Comment