🌿🌿🌿🌿🌿🌿🌿🌿
*భార్యదే అసలైన చదువు..!*
*********************
అవును..
*భార్యదే నిజమైన చదువు.*
చిన్నప్పుడు *తల్లిదండ్రులను..*
చదువుకున్నప్పుడు *స్నేహితులను..*
కలిసిమెలిసితిరిగేటప్పుడు *ఇరుగుపొరుగు వారిని..*
*చదువుకుంది..*
.....................
పెళ్ళి అయ్యాక *భర్తను చదువుతుంది*.
*పిల్లలను చదువుతుంది*.
*తన కుటుంబ సభ్యులను చదువుతుంది*.
*పరిసరాలను చదువుతుంది*..
అందుకే...
*భర్తకు.. తన గురించి తనకు*
*తెలియని విషయాలెన్నో*
*భార్యకు తెలుసు!*
*తల్లికి ఏం యిష్టమో తన కంటే తన భార్యకే బాగా తెలుసు*.
*పిల్లలు ఏం తింటారో తండ్రిగా తన కంటే తల్లిగా తనకే తెలుసు*.
అందుకు ...
*ఆశ్చర్యం, ఆనందం.. రెండూనూ!*
.....................
*సంసారం ఒక గడియారమనుకుంటే...*
*చిన్న ముల్లు భర్త,*
*పెద్ద ముల్లు భార్య*
*గంటల ముల్లులా మందగమనం భర్త వ్యవహారం!*
*నిమషాల ముల్లులా చకచకా సాగుతుంది భార్య శతావదానం!*
*వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట..*
*కనీసం ఇల్లైనా ఊడుద్దామంటే*
*చీపురు చిరాకు పడుతుందట..!*
*పోనీ ..భోజనానంతరమైనా కంచాలు కడగడంలో చేయికలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా చేయడానికా అని కంట నీరు తిప్పుతుంది*
ఇవన్నీ తన అధ్యయనం వల్లే నేర్చుకుంది.
*ఇన్ని చదువుతున్న తనకు ఇంగ్లీషు చదవడం నేర్పుదామంటే నువ్వుండగ నాకేం లోటని*.. *అమాయకంగా నవ్వుతుంది పిచ్చిదాయి*.
*ఇంకా..లెక్కల్లో కూడా నేనే ఫష్ట్ అంటుంది*.. *పేపరుమీద రూపాయల లెక్కలు మీరు చెబితే ..ఆ రూపాయలతో ఇల్లు చక్కబెట్టే లెక్కలు నావని అంటుంది*.
ఎందుకంటే..
*పుస్తకాల్ని మాత్రమే చదివేది భర్త*.
*భర్తను సైతం చదివేది భార్య.*
.....................
*ఇంటిల్లపాదిని*
*తన హస్తరేఖలుగా* *మలచుకొన్న*
*తన నేర్పంతా ..*
*తన సంస్కారం ముందు తల వంచుతునేఉంటుంది*
*!*
*అందుకే ఆమె చదువే గొప్పది*.
*ఆమె సంస్కారమే ఎనలేనిది.*
*ఓడి గెలుస్తుంటుంది భార్య!*
*గెలిచి ఓడేది భర్త.. !!*
*అందుకే తనే ఓ సిద్ధాంతమైంది*.
*పెసలు నలిగి పిండి కాలాలంటే తిరగలి పాప ఒకటి తిరగుతుండాలి.. ఇంకొకటి కదలకుండా ఉండాలి ..అని తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది*
*పనిమనిషినైనా పెట్టకుందామంటే పనిచేయని ఒళ్ళు రోగాల పుట్టని ఆరోగ్య చిట్కాలు చెబుతుంది!*
ఎలా చూసినా ..
*_అసలైన చదువు తనదేనని అనుక్షణం రుజువు చేస్తూనే ఉంటుంది!*
అందుకే..
*శ్రీమతి ఒక అమూల్యమైన బహుమతి*
*ఆమే చదువుల సరస్వతి*
🌿🌿🌿🌺🌿🌿🌿
*🍁లోకాసమస్తా శుఖినోభవంతు💐*
No comments:
Post a Comment