ఆత్మీయ బంధుమిత్రులకు వినాయకచవితి మరియు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు విజ్ఞ నాయకుడు వినాయకుడు, శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్ణేశ్వరస్వామి వారు మరియు మా ఇంటి దైవం వినుకొండ శ్రీ రామభక్త శ్రీ గుంటి ఆంజనేయస్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
_*మంగళవారం : 19-09-2023*_
ఈ రోజు *AVB* మంచి మాట.. లు
మనిషి *కన్నా* విలువైనది *మనసు*,ఆవేశం కన్నా విలువైనది *ఆలోచన*, కోపం కన్నా విలువైనది *జాలి*,స్వార్థం కన్నా విలువైనది *త్యాగం* వీటన్నంటి కంటే విలువైనది *నీ స్నేహం తో కూడిన పరిచయం నేస్తమా* !
మనం *కష్టపడాలన్నా* ఈ క్షణమే మనం *ఆనందించాలన్నా* ఈ క్షణమే,మనం *బ్రతకాలన్నా* ఈ క్షణమే, *బ్రతికించాలన్నా* ఈ క్షణమే, ఎందుకంటే *నిన్న నీది కాదు* గడచిపోయింది కాబట్టి, *రేపు నీది కాదు* ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి,ఈ *క్షణమే నీది నేస్తమా* .
నేనే అనే *అహంకారం* ఉంటే నీతోనే నువ్వు *పతనం* అవుతావు, మనం అనే *ప్రేమ* ఉంటే నీతో *పాటు* అందరూ ఉంటారు, *నువ్వు* లేనప్పుడు కూడా *నీకోసం* ఉంటారు . *వ్యక్తులు* శాశ్వతం కాదు *వ్యవస్థ* శాశ్వతం *అధికారం* శాశ్వతం కాదు *ఆప్యాయత* శాశ్వతం .
నోటిలో నుంచి వచ్చే *మాటని* అదుపు చేయ గల వాళ్ళు ప్రపంచంలో దేనినైన *జయించ* గలగుతారు, *మాట* చాలా *శక్తి* వంతమైనది , చెడ్డ *పని* కన్న చెడ్డ *మాట* చాలా ప్రమాదకరమైనది తెలుసుకోండి మిత్రమా
సేకరణ ✒️*మీ ..ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు,9985255805 💐🤝
No comments:
Post a Comment