*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter--4:--- కామం -- ధ్యానం* 🌹
🌷 *Part -- 1* 🌷
🏵️ కామం పట్ల అవగాహన ఎంత గంభీరంగా ఎంత లోతుగా ఉంటే అంతంత ఉదాత్త స్థితికి, ఎత్తులకూ దాన్ని తీసుకెళ్ళగలిగే అవకాశం మనకుంటుంది. అవగాహన ఎంతగా ఉండదో అంతగా దాన్ని అణిచిపెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. అణిచిపెట్టే ప్రయత్నాలు ఎప్పుడూ విజయవంతం కావు. అవి ఎప్పుడూ సంతోషాన్ని కల్గించవు. ఎప్పుడూ ఆరోగ్యదాయకంగా ఉండవు.
🌿 కామం ఆత్మావలోకనం చేసుకోగలిగే దారిలో - మనిషిని నడిపించగలగాలి. ఆ పయనానికి కామెచ్చే ఆరంభంగా, దివ్య జ్ఞాన ప్రకాశమే లక్ష్యంగా ఉండాలి.
🍁 బాల్యంలో మనం స్వర్గం లోనే ఉన్నాం. కానీ పెరిగి పెద్దవుతున్న కొద్దీ మనం నరకానికే దారి తీస్తాం. మన బాల్యం నాటి ప్రపంచం అమాయకత్వానికీ, నిర్మలత్వానికీ ప్రతీకగా ఉండేది కానీ అబద్ధాలతో, మోసాలతో, నిండి ఉన్న మార్గంలో పయనిస్తూ మనం పరిపక్వతకి వచ్చే నాటికే వృద్ధులపై పోయాం - ఆధ్యాత్మికంగానూ, భౌతికంగానూ కూడా.
☘️ అనంత ప్రజ్ఞా భావాతీతా స్థితిని అందుకోవడానికి, ఆ అంతరాత్మనుభూతిని పొందడానికీ రెండు మార్గాలు ఉన్నాయి. అవి , *'కామం', 'ధ్యానం'.*
🌷 మానవుని కామ పిపాసా జాడ్యం నుండి స్వస్థత కలిగించాలంటే, కామ ద్వారం తెరుచుకోక మునుపే మరో కొత్త ద్వారాన్ని సృష్టించడం అత్యంత ఆవశక్యం ఆ నవ్య ద్వారమే ధ్యానం.
🌸 పసి తనంలో ఉన్న పిల్లలందరికీ ధ్యానాన్ని తప్పకుండా నేర్పించాలి ! ధ్యానం ఎలా చెయ్యాలో బోధించాలి ! అంతే కానీ పిల్లలకు కామం గురించి చెడుగా బోధించకూడదు! ధ్యానమే బోధించాలి ! ధ్యానమే సరియైన దారి, ఉన్నత మార్గం ! కామాన్ని, ధ్యానాన్ని బేరీజు వేసి చూడాలి. అప్పుడు ధ్యానమే ఉత్తమమైన మార్గమని అర్థమవుతుంది. సెక్స్'ని తిట్టడం కాకుండా పిల్లలకు ధ్యానం చెయ్యడం సక్రమంగా నేర్పించాలి.
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter--4:--- కామం -- ధ్యానం* 🌹
🌷 *Part -- 2* 🌷
🏵️ సెక్స్ గురించి చెడుగా చెబితే వాళ్ళల్లో ఆ కామం పట్లే కుతూహలం ఎక్కువవుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన పద్దతి.
🌼 బాల్యంలో ఉన్న ప్రతి పసి మనస్సునూ ధ్యాన మార్గంలో ప్రయాణించేట్లు చేయనంత వరకూ ఈ భూగ్రహం మీద శాంతి నెలకొనే అవకాశమే లేదు !
🌳 ధ్యానంగా కామం రూపాంతరం చెందించాలంటే, మొట్ట మొదటగా పిల్లలతో ధ్యానం చేయించడం ప్రారంభించాలి. వాళ్ళ బుద్ధిని వాళ్ళే పెంపొందించుకోవాలనీ తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని వీలైనంత మౌనంగా ఉండడాన్ని వాళ్లు అభ్యసించాలనీ, ఆలోచనారహిత, అమనస్క స్థితిలోనే ఉండాలని వాళ్ళకు బోధించాలి.
🍀 పిల్లలకు విశ్వాసంతో తొలి పరిచయమూ, భగవంతునితో తొలి పరిచయమూ, తమ తల్లిదండ్రుల ద్వారానే ఏర్పడుతుంది.
🌿 తల్లిదండ్రుల మీద పిల్లలకి గల గౌరవాభిమానాలే వారి ఆధ్యాత్మిక జీవితానికి పునాది రాళ్ళు అవుతాయి.
🍁 ఒక గంట మౌనం మనలో అపారమైన శక్తిని కూడబెడ్తుందీ. అలా కూడబెట్టబడిన శక్తి, 14 సంవత్సరాల వయస్సులో ఉవ్వెత్తున తరంగలా లేచి ధ్యాన ద్వారాన్ని త్రోసుకుంటూ ప్రవహించి, ధ్యాన స్థితిని కల్గిస్తుంది.
☘️ కామాన్ని అధిగమించాలంటే ధ్యానమే రాజబాట.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
No comments:
Post a Comment