🙏తిరిగిరాని సంప్రదాయం..🙏
🌿పెద్దలకు "మహారాజశ్రీ" అనే పదం వాడేవారు...
🌸పిన్నలకు "ప్రియమైన" లేక "చిరంజీవి" పదాలు వాడే వారు...
🌿స్త్రీలకు పెద్దవాళ్ళైతే " లక్ష్మి సమానురాలగు" పదాలు వాడేవారు...
🌸విధవలకు "గంగాభాగీరథీ సమానురాలగు" అనే పదాలు వాడేవారు...
🌿ఆ రోజుల్లో పోస్టుకార్డులు ఎక్కువగా వాడేవారు...
🌸ఉత్తరం యొక్క శరీర భాగంలో ఆరోగ్య సమాచారాలు, కష్టసుఖాలు, కుటుంబ సమస్యలు, బాంధవ్యాలకు అనుగుణంగా సంభోదించుకొంటూ, పెద్దలకు నమస్కారాలు, పిన్నలకు దీవెనలతో ముగిస్తుండేవారు...
🌿ఆనాటి ఉత్తరాల్లో ప్రేమ, పెద్దరికం, చక్కని బాంధవ్యాలు కనిపించేవి.
వివాహాలు, అమ్మాయిల వోణీ ధారణ లాంటి శుభ సమాచారాలుంటే ఉత్తరానికి నలుమూలల పసుపు రాసి పంపిస్తుండేవారు.
🌸చావులాంటి అశుభ వార్తలుంటే సిరా ఉత్తరానికి నలుమూలల రాసి పంపిస్తుండేవారు.
🌿అలాంటి ఉత్తరాలు వస్తే చదివి బయటే చించి పడేస్తుండేవారు.
మామూలు ఉత్తరాలను ఒక *తీగెకు గుచ్చి పదిలంగా ఉంచుతుండేవారు.
నేడు ఉత్తరాల సాంప్రదాయం పోయింది.
🌸భాషలో సంస్కారహీనత, పెద్దలంటే నిర్లక్షత, గౌరవ రహితం. చరవాణి ద్వారా అర్ధం కాని లఘు సందేశాలు పంపించి చేతులు దులిపేసుకుంటారు.
🙏నమస్కరించే సంస్కారం పోయింది..🙏.
No comments:
Post a Comment