Wednesday, September 13, 2023

సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺 🌹 *Chapter-- 6:--- సమాధి స్థితి పరమావధి అయితే కామం మొదటి పెట్టు

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter-- 6:--- సమాధి స్థితి పరమావధి అయితే కామం మొదటి పెట్టు* 🌹
🌷 *Part -- 1* 🌷

☘️ కామకేళిలో గత జన్మలో నిష్ణాతుడైన మానవుడే ఈ జన్మలో కామం నుంచి ముక్తుడై బ్రహ్మచారి కాగలుగుతాడు. *'కామం'* అతనిలో ఏ అలజడినీ సృష్టించ లేదు. మనస్సులో కూడా ఏ మాత్రమూ ఆందోళన కలుగనేకలుగదు. 

🔺 *సంభోగ సంపూర్ణ అనుభవాన్ని సాధించేందుకు ఉపకరించేవి 2 అంశాలు.అవి:-*

🔶1) శ్వాస అతి నెమ్మదిగా, ఇంకా నెమ్మదిగా దాదాపుగా శ్వాస ఆగిపోయిందని అనిపించేలా ఉంచుకోవడం. 

🔷 2) మీ చైతన్యాన్ని, మీక ఎరుకను ఆజ్ఞా చక్రంలో, మీ భ్రుకుటిలో  మీ రెండు కళ్ళ మధ్య ప్రదేశంలో లప్తం చేసి స్థిరంగా ఉంచుకోవడం. 

🌷 ఆజ్ఞా చకంలో మీ చేతనత్వం ఎంతగా సుప్రతిష్టితమై ఉంటుందో అంతగానూ మీ సంభోగ పరాకాష్ట మీలోనూ నెలకొని సుప్రతిష్ఠితమవుతుంది. మీ శ్వాస ఎంత నెమ్మదిగా సాగుతుందో మీ సంభోగ సమయమూ అంతగా అధికమవుతూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే మీరు మొట్ట మొదటి సారిగా మీకున్న *"ఆకర్షణ"* సంభోగం పట్ల కాదనీ, దాని ద్వారా మీరు సాధిస్తున్న *"సమాధి స్థితి"* మీదేనన్న సత్యం అవగత మవుతుంది ". బలవంతమైన అయస్కాంతపు శక్తి లాగా సమాధి స్థితిని సాధించాలన్న తీవ్రమైన ఆకర్షణే మిమల్ని కామ మార్గం ద్వారా ప్రేరేపిస్తున్నదని పూర్తి అవగాహనను అవగతం చేసుకోగలుగుతారు. 

🌸 మీ హృదయం ఆనందంతో ఉప్పొంగుతూ ఉన్నప్పుడే, శాంతి కృతజ్ఞత మీలో నెలకొని ఉన్నప్పుడే రతికేళీ సలిపేందుకు మీరు యోచించాలి.

🌼 సమాధి స్థితిలో ఓ వ్యక్తి విశ్వాసంతో విలీనమవుతాడు. కామంలో ఇద్దరి వ్యక్తుల కలయిక ఉంటుంది. సమాధిలో వ్యక్తి తన ఉనికినే పోగొట్టుకుని  సృష్టిలో లీనమైపోతాడు. ఇద్దరి వ్యక్తుల సంగమం తాత్కాలికం, కానీ విశ్వంలో విలీనం మాత్రం శాశ్వతం. 


🌷 *Part -- 2* 🌷

🌳 సంభోగపు పరాకాష్ఠలో ఓ క్షణం పూర్తిగా దగ్గరైనా, వాళ్ళు విడిపోక తప్పదు. ఆ వియోగం ఎంతో బాధను కలిగిస్తుంది. అందువల్లే ప్రేమికులు నిరాశతో కృంగిపోతూ ఉంటారు. తమ ఎదుటి వ్యక్తే తమ నిరాశకు కారణమని ఆ ఇద్దరూ ప్రేమికులూ, అనుకుంటూ ఒంటరితనంతోనూ, చిరాకుతోనూ జీవనం సాగిస్తూంటారు.

🏵️ క్షణికమైన సంభోగ సుఖమే ఇలా ఉంటే ఆ విశ్వాతతో విలీనం పొందినప్పటి బహ్మానందం ఇంకెంత ఉదాత్తంగా ఉంటుందో ఆ బ్రహ్మనంద అనుభవం అవధులు లేనిది, అలౌకికమైనది, వర్ణనాతీతమైనది.

🌿 శాశ్వతానందాన్ని బ్రహ్మానందాన్ని పొందిన వ్యక్తికి విషయ భోగాలన్నీ తృణ ప్రాయాలుగా కన్పిస్తాయి, పిచ్చి చెష్ఠలుగా  కనిపిస్తాయి. వాటి మీద విరక్తి కలుగుతుంది. 

🍁 కామం నుంచి సమాధి స్థితి వరకూ మధ్య ఎంతో దూరం ఉంది. సమాధి స్థితి పరమావధి అయితే కామం మొదటి మెట్టు మాత్రమే. కానీ ఈ మొదటి మెట్టునే అసహ్యించుకునే వాళ్ళు, నిషేధిస్తున్న వాళ్ళు కనీసం రెండో మెట్టను కూడా అధిరోహించలేరని నేను మీకు గుర్తు చేస్తున్నాను. 

🍀 సంభోగం సుఖం కోసమే నిర్ధేశించబడిన సాధనం మాత్రమే కాకూడదు, మానవుణ్ణి ఆధ్యాత్మిక ఎత్తులకు చేర్చి ప్రక్రియ అని మనం గ్రహించాలి.

🌷 *Part -- 3* 🌷

☘️ ఏ కార్యం వల్ల మానవుడికి సంతానోత్పత్తి సాధ్యమవుతుందో ఏ కార్యం వల్ల నవ్య సంతతి పుట్టుకొస్తోందో, ఏ కార్యం ద్వారా కొత్త కొత్త ఆత్మలు శరీరాన్ని ధరించి ప్రపంచంలోకి రాగలుగుతున్నామో ఆ సృష్టి కార్యం గురించి సవ్యమైన అవగాహన మనలో లేకపోవడం ఓ ఘోరమైన తప్పిదమే కదూ? సంభోగపు పరాకాష్టలో ఏర్పడే ఓ స్థితిలోకి ఆత్మ చేరుకుంటుందనీ, ఆ క్షణాన్నే ఓ కొత్త జీవి అందువల్ల జన్మను ప్రారంభిస్తుందనీ బవుతో మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీ సంభోగపు పరాకాష్ట ఓ స్థితిని మాత్రం సృష్టిస్తుంది. ఆ స్థితి తనకు అనుకూలిస్తూ, తన ప్రవేశానికి తగిన లక్షణాల పరిధిని పొంది ఉన్నప్పుడు, ఆత్మ ప్రవేశిస్తుంది. జన్మించబోయే ఆత్మ యొక్క లక్షణం, ఆ స్థితిలో ఉన్న లక్షణాల మీదే ఆధారపడి ఉంటుంది.

🌸 కోప స్థితిలోనో, దిగులుగా ఉన్న స్థితిలోనో, ఓ దోషంతో ఉన్న స్థితిలోనో ఆత్మ ప్రవేశం జరిగి, జన్మ ప్రారంభమయితే, ఆ పుట్టబోతున్న శిశువు ఆ లక్షణాలతోనే జన్మిస్తుంది . ఓ వ్యక్తి పూర్తి వ్యక్తిత్వం అతడు జన్మించిన క్షణాన్నే రూపుదిద్దుకుని సృష్టింపబడుతుంది. 

🌼ఎందరో వచ్చారు , ఎందరో బోధించారు . ఎందరో వెళ్ళిపోయారు , కానీ మానవుడింకా చీకటిలోనే దేవులాడుతున్నాడు. సత్యం ఎప్పుడూ ప్రకటింపబడేందుకు సిద్ధంగానే ఉంటుంది . నిజంగా దాన్ని స్వంతంగా అవగతం చేసుకోవాలన్న కుతూహలమూ , పట్టుదలా మనకు ఉంటే చాలు .దురదృష్టం కొద్దీ అదే మనలో లోపించింది .

🌳 సత్యాన్ని గురించిన కొన్ని విషయాలను నేను మాట్లాడుతానని అందరూ అనుకున్నారు . కానీ సత్యాన్ని గురించి మాట్లాడేముందు మానవుడు సత్యాలుగా స్వీకరించిన కొన్ని అసత్యాలను పెకలించి పారేయవలసిన అవసరం ఉంది . " సత్యాలు " గా నన్ను సేకరించుకున్న ఎన్నో విషయాలు వాస్తవంలో అసత్యాలే ! వీటిని  అన్నింటినీ తొలగిస్తే తప్ప మన సత్యాన్వేషణ మార్గంలో మొదటి అడుగు కూడా పడే అవకాశమే లేదు .

🏵️ పుష్పాల నుంచి వస్తున్న సుగంధమంతా ఆ ఎరువు నుంచి వచ్చిన దుర్గంధమే తప్ప మరొకటి కాదనీ, అదే విత్తనంలోకి , అందులోంచి మొక్కలోకీ , చివరికి పుష్పానికీ చేరుకున్నదనీ బహుశా మీరు ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు . ఎరువు యొక్క దుర్గంధమే పుష్పానికున్న సుసుధంగామారుతుంది ! అదే విధంగా కామం కూడా ప్రేమగా పరిణమిస్తుంది.

🌿 జ్ఞానమే మతం అజ్ఞానమే మత పతనం . అసలు అజ్ఞానమే అధర్మం. అజ్ఞాన జీవితం ఏ స్థాయి లోనూ మనలో ఉండడాన్ని నేను(ఓషో) సహించలేను ! ఎంత  మూల్యం చెల్లించి అయినా సరే సత్యాన్ని ఆహ్వనించటానికి సర్వవేళలా సంసిద్ధుడిగా నేనుంటాను!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🍀 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

No comments:

Post a Comment