💖*అసురీ గుణాలు:~*
💞 *కామం:~ అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను “కామం” అంటాం.*
💞 *క్రోధం:~ అంటే కోపం. దీని వల్ల మనిషి గొప్పతనం సన్నగిల్లుతుంది. బ్రతుకు దుర్భరమవుతుంది. విపరీతమైన కోపం వచ్చిన వానికి పిచ్చి వానికి తేడా ఉండదు. ఆరోగ్యం సైతం క్షీణిస్తుంది.*
💞*లోభం:~ లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు. అతనికి దాన గుణం ఉండదు.*
💞*మోహం:~ అంటే పుత్ర మిత్ర కళత్రాదులందు, ధన ధాన్య వస్తువాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ. యుక్తా యుక్తాలను ఎరుగని చిత్త వృత్తి.*
💞*మదం:~ఇది ఎనిమిది విధాలు. అవి కలం, బలం, ధనం, రూపం, యవ్వనం, విద్య, రాజ్యం, తపస్సు.*
💞*మాత్సర్యం:~ఎందులోనైనా తన కంటె ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేక పోవటమే మత్సరం.*
💞*రాగము:~ఎదుట వారి ఇష్టా యిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం రాగం.*
💞*ద్వేషం:~ ఒకరు తనకు అపకారం చేశారని మళ్లీ వారికి అపకారం చేయాలనే చిత్తవృత్తి.*
💞*ఈర్ష్య:~తనకు మాత్రమే కష్టాలొస్తున్నాయనీ, ఇతరులకు ఎందుకెందుకు రావడంలేదనీ వారిపై ఏర్పడే కోపమే ఈర్ష్య.*
💞*అసూయ:~ తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి.*
💞*దంభము:~తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తి.*
💞*దర్పం:~సకల విషయాల్లో నేనే సమర్థుడననీ, తనకు సాటి ఐనవాడెక్కడా లేడని భావించే చిత్తవృత్తి (అదే గర్వం)*
💞*అహంకారం:~అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణ సంబంధిత చిత్తవృత్తి గలవారు అహంకారులు.*
💖*మనం మనలోని ఆసురీ గుణాల్ని విడిచేందుకు సాధన చేయాలి. అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది. సాధనలకు గురువు సహకారం అవసరం. శాస్త్రాలు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్దేశించాయి. వాటిని పాటించితే చాలు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment