🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 9:--- చంపబడిన వారు మరణించరు, అమరులవుతారు.*🌹
🌷 *Part -- 1* 🌷
🍁 నాకో ఉత్తరం వచ్చింది. నా కామ ప్రసంగాలు ఇలాగే కొనసాగితే నన్ను తుపాకీతో కాల్చి చంపుతానని ఓ మిత్రుడు వ్రాసిన ఉత్తరం అది. అతడికి వెంటనే బదులిద్దామని అనిపించింది, కానీ, ట్రిగ్గర్ నొక్కోడానికి ఉవ్విళ్ళూరుతున్న ఆ మిత్రుడు ఆ ఉత్తరం మీద తన చిరునామా వ్రాయడాన్ని, కనీసం సంతకం చెయ్యడాన్ని మరిచిపోయేంత పిరికి వాడుగా ఉన్నట్టు నాకు అర్థమైంది.
🍀 బహుశా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అతడు భయపడి ఉండొచ్చు. ఏది ఏమయినా ఒక వేళ ఆ లేఖ కర్త ఇప్పుడు ఇక్కడే ఉంటే, అతడు నా ప్రత్యుత్తరాన్ని స్వీకరించి తీరాలి. అతడిప్పుడిక్కడ ఉన్నా బహుశా ఓ గోడ వెనుకో, ఓ చెట్టు మాటునో నక్కి ఉంటాడని మాత్రం నేను నిశ్చయంగా చెప్పగలను. ఈ చుట్టు ప్రక్కల ఆ మనిషి ఎక్కడయినా ఉంటే నేను ఈ బెదిరింపు ఉత్తరం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయననీ, అతుడు తన చిరునామాను నాకు అందించగలిగితే ఓ ప్రత్యుత్తరాన్ని వ్రాసి పంపించగలననీ తెలియజేస్తున్నాను. అంత ధైర్యం కూడా అతనిలో లేకుండా ఉన్నట్లయితే, నా సమాధానాన్ని అతడు ఇప్పుడే ఇక్కడే వింటే చాలు.
🌸 తనేం చేస్తున్నాడో బహుశా అతడికి తెలుస్తున్నట్లు లేదు. కానీ అతడు నన్ను చంపేసే ప్రయత్నాన్ని అతడు చేయకూడదు. ఎందుకంటే సరిగ్గా ఆ ప్రయత్నం వల్ల నేను
మాట్లాడుతున్న మాటలన్నీ నిత్య సత్యాలైపోతాయి. జీసస్ ను శిలువవేసి ఉండకపోతే, ఆయన్ని అందరూ ఎప్పుడో మరచిపోయి ఉండే వాళ్ళు. ఒక విధంగా చూస్తే జీసస్ అనుభవించిన ఘోర హింస వల్లే అతడికి ఎంతో లాభం చేకూరిందని మనకు అర్థమవుతుంది. తను శిలువ వేయబడితే తన మాటలన్నీ సత్యాలై యుగాల పర్వంతం శాశ్వతంగా నిలిచి ఉంటాయనీ, కోట్లాది ప్రజలు ప్రభావితులవుతారనీ, ఎనలేని శ్రేయస్సును తద్వారా పొందుతారనీ తన శిలువ కార్యక్రమాన్ని స్వయంగా జీససే నిర్మించుకున్నాడు.
☘️ బుద్ధుడిని కానీ, మహమ్మద్ గానీ, రాముణ్ణి గానీ, కృష్మణ్ణి గానీ, మహా వీరుణ్ణి గానీ ఎవ్వరినీ ఈ భూమి మీద శిలువ వేసి చంపలేరు. ఒక్క జీసస్ట ను తప్ప. అందువల్లే ప్రపంచంలో saగం జనాభా క్రైస్తవులుగా తయారయ్యారు. కాబట్టి, నన్ను చంపేందుకు మరీ అంత తొందర పడవద్దని నేను ఆ మిత్రునికి హితవు చెబుతున్నాను. వినకపోతే ఇక జీవితాంతమూ తను చేసిన తొందరపాటు చర్యకు అతడు చింతిస్తూనే, వేదనను, అనుభవిస్తూనే ఉండాల్సి వస్తుంది.
🌼 గాంధేయ వాదులు, అందరూ కలిసి ప్రయత్నించి ఆయన కీర్తినీ, ఆలోచనలనూ ఎంత గొప్ప ఎత్తులకు తీసుకెళ్ళగలిగి ఉండె వారో అంతకంటే ఉన్నత శిఖరాలకు తను తీసుకెళ్ళడంలో కృతకృత్యుడినయ్యానని, గాంధీ శరీరాన్ని తూటాలతో, నింపి హత్య చేసిన గాడ్సే ఊహించకలేకపోయాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌿 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
No comments:
Post a Comment