Wednesday, October 11, 2023

మంచి మాట..లు(09-10-2023)

 ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభాకాంక్షలు..💐 సర్వేశ్వరుడు పరమేశ్వరుని అనుగ్రహంతో  మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ..

*సోమవారం --: 09-10-2023 :--*
ఈ రోజు *AVB* మంచి మాట.. లు 
       మనిషికి *ఓపిక* చాలా విలువైనది అది ఎంత ఎక్కువ ఉంటే *జీవితంలో* అంత ఎక్కువగా నేర్చుకుంటాడు .

   *ఆవేశానికి* ఆలోచన ఎంత ముఖ్యమో *ఆశయానికి* అవకాశం కూడ అంతే ముఖ్యం .

        *ఇప్టంతో* చేసే పని మనలో *శక్తిని* పెంచుతుంది *కష్టంతో* చేసే పని మనలో *శక్తిని* నీరసం కలిగిస్తుంది, కాబట్టి చేసే  *పని ఏదైనా* సరే  *ఇష్టంతో* చేయడానికే ప్రయత్నించాలి,

      వందల మంది *శత్రువుల* కన్నా ఒక *నమ్మక ద్రోహి* చాలా ప్రమాదకారి *నీ మంచి కోరుకునే వాళ్ళను* దూరం చేసుకోకు *నీ చెడు కోరుకునే వాళ్ళను* దగ్గర రానియ్యకు *స్వార్థంతో* నిన్ను పొగిడేవాళ్ళను ఎప్పటికీ *నమ్మకు*

         *మనుషుల్లో* మార్పు అనేది చాలా సహజమైనది *ఎలా* మారాలి అన్నది మనకు *వివేకం* చెబుతుంది, ఎప్పుడు *ఎలా* మారాలి అన్నది *అనుభవం* చెబుతుంది, *ఎందుకు* మారాలి అన్నది మనలోని *అవసరం* చెబుతుంది .

         నిన్న గడిచిన *గతం* లో ఇప్పుడు ఏమి చేయలేము, రేపు రాభోయే *భవిష్యత్* ఉంటుందో లేదో తెలియదు.. ఇప్పుడు *నడుస్తున్న* కాలం మీది, ఈ కాలంలో నీకు మంచి అనిపించింది ఏదైనా వెంటనే చేయండి

     సేకరణ 🖊️*మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు,9985255805 💐🌹🌷🤝

No comments:

Post a Comment