Tuesday, October 10, 2023

పరమాత్మను పొందడం ఎలా? వివేక, విమోక, అభ్యాస, క్రియా, కల్యాణ, అనవసాద, అనుద్ధర్షాలనే సాధన సప్తకాలతో మాత్రమే ఇది సాధ్యమౌతుంది.

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝❤️ *జనన మరణాలూ, ముసలితనమూ… ఇవేవీ లేని పరమానందస్వరూపుడైన పరమాత్మను పొందడం ఎలా?*
💖 *”ఉపాసనాత్మకమైన జ్ఞానం ద్వారా పొందవచ్చు” అని ముండకోపనిషత్తు చెబుతోంది. వివేక, విమోక, అభ్యాస, క్రియా, కల్యాణ, అనవసాద, అనుద్ధర్షాలనే సాధన సప్తకాలతో మాత్రమే ఇది సాధ్యమౌతుంది.*
❤️ *1)వివేకం:* మంచి చెడులను గుర్తించగల వివేక సంపన్నుడు మానవుడు. అంతఃకరణ శుద్ధికి అవసరమైన, దోషరహితమైన ఆహారం స్వీకరించడం వల్లనే మనిషి వివేకవంతుడు అవుతాడు.
💓*2)విమోకం:* భోగ వస్తువులయందు, విషయముల యందు వ్యామోహము ఏర్పడకుండా జాగ్రత్తపడటమే విమోకం. భోగలాలసునికి ఉపాసన దశలో స్థిరచిత్తం ఏర్పడదు. కాబట్టి భోగలాలసను వదలాలి.
💞*3)అభ్యాసం:* బయటి ప్రపంచంలోని వ్యక్తులపై అనురాగం ఏర్పడకుండా నిత్యం, నిరంతరం.. సమస్త శుభాలకు కేంద్రమైన ఆ భగవంతుని స్మరించడాన్నే అభ్యాసం అంటారు.
💕*4)క్రియ:* తమ శక్తి మేరకు రోజూ పంచమహాయజ్ఞాలను నిర్వహించడమే క్రియ. 
*అవి:~*
💕దేవ యజ్ఞం: జపం, హోమం, స్తుతి, అర్చనతో దేవతారాధన చేయడం.
💕బ్రహ్మ యజ్ఞం: విజ్ఞాన సర్వస్వాలు, విశ్వశ్రేయస్కరాలు అయిన వేదాలను అధ్యయనం చేయడం.
💕పితృ యజ్ఞం: తల్లిదండ్రులను ఆదరించడం, వారి యోగక్షేమాలను శ్రద్ధగా పట్టించుకోవడం.. వారు స్వర్గస్థులయ్యాక శ్రద్ధతో వారికి పిండతర్పణాదులను సమర్పించడం.
💕మనుష్య యజ్ఞం: అతిథి, అభ్యాగతులను, బంధు మిత్రులను ఆదరించడం. వారికి తగిన సేవలను అందించడం. మాటలతో చేష్టలతో నొప్పించకపోవడం.
💕భూతయజ్ఞము: సాధుజంతువులైన గోవులకు ఇతర ప్రాణులకు ఆహారాన్ని అందించడం. ~ఈ ఐదు యజ్ఞాలను నిర్వర్తించడమే క్రియ.
💖 *5)కల్యాణం:* సమస్త ప్రాణులకూ మేలుకలిగేలా త్రికరణ శుద్ధితో వ్యవహరించడం. మాటలతో చేష్టలతో ఎవరినీ హింసించకుండా ఇతరులకు ఉపయోగపడే మాటలనే పలకడం, పనులనే చేయడం.
❤️ *6)అనవసాదం:* ఎలాంటి సందర్భంలోనూ మనసులో నిరుత్సాహం ఏర్పడకుండా మనసును, శరీరాన్ని శక్తిమంతంగా ఉంచుకోవడం.

💓*7)అనుద్ధర్షం:* సంపదలు పెరిగాయనో, మహోన్నత పదవి లభించిందనో, జ్ఞానమో రూపమో గుణములో తమలో ఎక్కువగా ఉన్నాయనే భావనలతో అతిగా సంతోషమును పొందక పోవడం. 
💖~ఈ సాధన సప్తకం ఉపాసకులకు అత్యావశ్యకము.    

Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment