Sunday, October 15, 2023

చెప్పుల్లేకుండా నడవడం వల్ల

 🌳🌱🌿🍃🪴🎋🌾🌼🌻🌿🌱

*_పూర్వీకులు నిరంతరం గతుకుల రోడ్లపై, పొలం గట్ల వెంబడి చెప్పుల్లేకుండా నడవడం వల్ల మారు చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. స్టెల్, ఫ్యాషన్ పేరుతో బెడ్ రూంలో కూడా చెప్పులేసుకుని తిరుగుతున్నారు. ఉదయం మంచం దిగింది మొదలు రాత్రి పడుకునే వరకు పాదాలకు చెప్పులు ఉండాల్సిందే. దీంతో పాదాలు అందంగా ఉంటాయి అనుకుంటారు. అందం విషయం పక్కన పెడితే ఆనారోగ్యం బారిన పడతారు. అరోగ్యం కంటే అందం ముఖ్యం కాదు కదా!_*

*_# చెప్పుల్లేకుండా నడవడం వల్ల కలిగే మార్పులు_* 

*_1. శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. సహనం కూడా పెరుగుతుంది._*

*_2. పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి, జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది._*

*_3. చిన్న చిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల పాదాలలో రక్తప్రసరణ పనితీరు మెరుగవుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది._*

*_4. మానవుని పాదాల్లో 72 వేల నరాల కొనలు ఉంటాయి. ఎక్కువసేపు పాదారక్షలు వాడడం వల్ల సున్నితమైన నరాలు చచ్చుబడిపోతాయి. అదే చెప్పుల్లేకుండా నడవడం వల్ల ఈ నరాలు యాక్టివ్‌గా ఉంటాయి._*

*_కాబటి పార్కుల్లో, ఆఫీసుల్లో, ఇంట్లో చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి._*

*_# వయసును బట్టి ఎంత నడవాలి ?_*

*_40 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్నవారు ప్రతిరోజూ కనీసం 3.75 కి.మీ. నడవాలి._*

*_45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు వయసున్నవారు ప్రతిరోజూ కనీసం 3.5 కి.మీ. నడవాలి._*

*_50 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు వయసున్నవారు ప్రతిరోజూ కనీసం 3.1 కి.మీ. నడవాలి._*

*_55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయసున్నవారు ప్రతిరోజూ కనీసం 3.5 కి.మీ. నడవాలి._*

*60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ప్రతిరోజూ కనీసం 2.5 కి.మీ. నడవాలి._*

*_ఒక సర్వే ప్రకారం ఎవరైతే ప్రతి వారం కనీసం 2 గం. నడుస్తారో.. మిగతావారి కన్నా 40 శాతం ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారణ అయింది._🙏

No comments:

Post a Comment