Tuesday, October 10, 2023

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝 *విశ్వ పురుషుడి యొక్క హృదయం శ్రీ సూక్తం.*
💖 *”హిరణ్యవర్ణాం హరిణీమ్ సువర్ణ రజతస్రజామ్ చంద్రామ్ హిరణ్మయీం."అంతా ‘హిరణ్యం’ తో మొదలుపెట్టారు. హిరణ్యగర్భ స్థితి ఆ హృదయం. అంతే కానీ అమ్మవారు కాదు. స్త్రీ రూపంతో వర్ణిస్తూంటాం. “కిడ్ మోడల్”అన్నమాట.* 
❤️ *ఆలయాన్నింటిలో కూడా ఉపచారాలన్నీ “పురుష సూక్తం”, “శ్రీ సూక్తం” తోనే ఉంటాయి. అభిషేకం చేయాలంటే రుద్రం చదువుతారంతే!*
💖 *కనుక “కైవల్యాశ్రమం”లో ఉన్న సత్సంగ సభ్యులందరూ ఈ మూడింటినీ నేర్చుకోవాలి. ఇది “ప్రాథమిక విద్య” అన్నమాట.*
❤️ *~ఇక “నాల్గవది ఏమిటి?* 💕 *విశ్వమంతా ఆయనదే ఐన ఆయనకు నువ్విచ్చేది ఏమిటి? “మంత్రపుష్పాన్ని” ఇవ్వొచ్చు. అది మాత్రమే నువ్వివ్వగలిగేది. కనుక “మంత్రపుష్పం” నేర్చుకోవాలి. అందరికీ ‘పురుష సూక్తం’, ‘శ్రీసూక్తo’, ‘రుద్రం’ రావాలి. ఈ నాలుగు నేర్చుకుంటే చాలు. వైదిక కర్మలేవీ చేయక పోయినా ఫరవాలేదు, “విరాట్ పురుష హృదయం” అర్థం ఔతుంది. ఆ “అవ్యాకృత స్థితి” అర్థం కావాలి.* 
💖 *నిజానికి మహేశ్వరుడికి ఆకారమే లేదు. సంకల్పంతో  ఏ రూపాన్నైనా ధరించగలడు. ఆయన “శూన్య స్వరూపుడు”. “శూన్యం” అంటే సున్నా. “పూర్ణం” అంటే కూడా’ ‘సున్నా’ అని మనకు తెలుసు కదా.* 
💞 *’ఓ' కి ముందుసున్నా, ‘ఓ’ కి తరువాత సున్నా ఉంటుంది పరిపూర్ణ నిర్ణయానికి. “శివ షడక్షర స్తోత్రం” అనేదొకటి ఉన్న విషయం మనకు తెలుసు. “నమశ్శివాయ” కు ముందు ఓంకారాన్ని జోడిస్తారన్నమాట.*
💖 *”ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ తస్మాత్ ఓం కారాయ నమో నమః". ఎలా ధ్యానించాలిట? అంటే, ‘ఓంకారానికి ముందు సున్నాను పెట్టి ధ్యానంచాలి’. మనమెలా ధ్యానిస్తున్నాం? “ఓం”అంటూ. ముందు సున్నా పెట్టి అనండి చూద్దాం! అనలేం. “శబ్ద బ్రహ్మం” “నిశ్శబ్ద బ్రహ్మం”ఐపోతుంది ముందు సున్నా పెడితే. సత్యం బోధపడాలి  మనకు. అదీ ఓంకారాన్ని ధ్యానించడం అంటే.*
💞 *ముందు సున్నా పెడితే అది శూన్యం.*
💞*~తర్వాత సున్నా పెడితే పూర్ణం.*
💞 *~మధ్యలో ‘ఓం’. ఆ “ఓ”అనే అక్షరం, అది అక్షరం. క్షరం కాదు. ఈ విశ్వమంతా ఆ “ఓ”. ఆ సర్వమంతా “ఓ”. ఆ పక్కన సున్నా పెడితే అది పూర్ణం. ఈ పక్కన సున్నా పెట్టాం. వెలుపల, దాపల, సున్నా పెడితే మధ్యలో ఉన్న 'ఓ' లేకుండా పోయింది. ఇది కందార్థంలో ఉంటుంది.*
💖 *’ఒంటుకి దాపల సున్నను అంటించిన వెలుపల సున్న సున్నయగు సుమీ' ! ~ఒకటికి ఒక పక్కన సున్నాలు పెంచుతూ పోతే ఒకటి విలువ పెరుగుతూ పోయిందట. అదే ఒకటికి ఇటుపక్క సున్నా పెట్టాం అనుకోండి. ఆ ఒకటే విలువ లేనిదైపోయిందనే సత్యాన్ని మనం గ్రహించాలి. కావాలి వాసనాక్షయం.*

💖 *ఆ విధంగా ఆ ఒకటనే మనసు, మాయ, ఎరుక, లేనివవ్వాలి. మనోనాశమై పోయింది. ఎప్పటికప్పుడుది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపమానాలను గుర్తుంచుకని వ్యవహరించాలి. ఎప్పుడైనా సరే “సిద్ధాంతం” ‘సిద్ధాంతం’ గా అర్థంకాకపోతే ఉపమానాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.*
❤️ *”అపరోక్ష జ్ఞాన నిర్ణయం”:* 💓 *~ఉన్నది బ్రహ్మమే. ఉన్నది పరమే. ఈ దృష్టితో చూడాలట. ఈ తత్త్వబోధలో మనమొక “జంక్షన్ పాయింట్”కి వచ్చాం. “సమష్టి బ్రహ్మాండం”లో “అధి దేవతలు” ఎలా ఉన్నారు ? అలాగే వ్యష్టిలో ఇంద్రియ సమూహాలెలా ఉన్నాయి ?*
💕 *ఆ దేవతా సమూహములు సాత్వికం.*
💕 *ఈ ఇంద్రియ సమూహాలు తామసికం.*
💕💕 *~మధ్యలో వ్యవహారం చేసేటటువంటి జీవభావమేమో రాజసికం.*
💓*~ఆ రాజసాంశల వలన అలా అవుతోంది.*
💓 *~ఈ తామసాంశల వలన ఇలా అవుతోంది.*
💓💓 *ఆ సాత్వికాంశలు అధి దైవికంగా ఇలా ఉన్నాయి. కనుక ఈ సృష్టి అంతా అధిదైవికం, అధి భౌతికం, అధ్యాత్మికం. సత్వ గుణం, రజోగుణం,తమోగుణం.*

💖 *మరి మనమేంచేయాలీ?*
💓 *~’తాపత్రయ వినిర్ముక్తః’ ~మూడూ నువ్వు కాదని బయటపడాలి. ఈ మూడు నాకు లేవనే స్థితిలో ఉండాలి. ఈ మూడింటి చేత ప్రభావితం కాకుండా ఉండాలి. ఈ మూడూ నీ స్వాధీనం అయి ఉండాలి. తాపత్రయములైనా, గుణ త్రయములైనా, శరీర త్రయములైనా, అన్నింటికీ మూల వస్తువు ఒకటే. అది నేనే. అది బ్రహ్మమే. ఈ సత్యం అవగతం కావాలి మనకు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment