Saturday, October 21, 2023

హార్ట్ ఫుల్ నెస్🌍కథతో, *డై ఎంప్టీ (ఖాళీగా మరణించు)*

 *365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో* 

 ♥️ *కథ-49* ♥️

 *అనుభూతి : నా అంతర్గత ప్రేరణతో నా ప్రియమైన వారిని ప్రేరేపించగల నా సామర్థ్యానికి నేను కృతజ్ఞతతో ఉన్నాను.* 

 *డై ఎంప్టీ   (ఖాళీగా మరణించు)* 

టాడ్ హెన్రీ రాసిన 'డై ఎంప్టీ' చాలా అద్భుతమైన పుస్తకాలలో ఒకటి. ఒక వ్యాపార సమావేశానికి హాజరైనప్పుడు విన్న ఒక విషయం ద్వారా రచయిత ఈ పుస్తకాన్ని వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు. 
ఆ సమావేశం నిర్వహిస్తున్న వ్యక్తి ప్రేక్షకులను ఇలా అడిగాడు: "ప్రపంచంలో అత్యంత సంపన్నమైన భూమి ఎక్కడ ఉంది?"
ఒకరు ఇలా సమాధానమిచ్చారు: "చమురు అధికంగా ఉండే గల్ఫ్ దేశాలు."
మరొకరు జోడించారు: "ఆఫ్రికాలోని వజ్రాల ఖని." 
కొన్ని సమాధానాల తర్వాత, నిర్వాహకుడు ఇలా అన్నాడు: "కాదు.. స్మశానవాటిక. 
అవును! ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన భూమి, ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు వెళ్లిపోయారు, "వారు చనిపోయారు" - ఇతరులకు ప్రయోజనం చేకూర్చే, వెలుగులోకి రాని అనేక విలువైన ఆలోచనలను వారితో  తీసుకెళ్లిపోయారు. ఈ వ్యక్తులను ఖననం చేసిన స్మశానవాటికలో అవన్నీ పాతిపెట్టబడి ఉన్నాయి."
ఈ సమాధానంతో ప్రేరణ పొందిన టాడ్ హెన్రీ "డై ఎంప్టీ " అనే పుస్తకాన్ని రాశాడు. ప్రజలను వారి ఆలోచనలను, అవ్యక్త శక్తులను వారి సమాజాలలో ప్రవహింపజేసేలా ప్రేరేపించడానికి, ఎక్కువ ఆలస్యం కాకముందే వాటిని ఉపయోగకరమైన వాటిగా మార్చడానికి అతను తన వంతు కృషి చేసాడు.
అతను తన పుస్తకంలో చెప్పిన వాటిలో చాలా ప్రముఖమైనది ఏమిటంటే: 
మీలో ఉన్న అత్యుత్తమమైన వాటిని మీతో తీసుకొని సమాధికి వెళ్లద్దు.. ఎల్లప్పుడూ ఖాళీగా మరణించడాన్ని ఎంచుకోండి.
ఈ వ్యక్తీకరణకు నిజమైన భావం ఏమిటంటే, 
మనలో ఉన్న మంచితనాన్ని అంతా ఖాళీచేసి మరణించాలి. 
మనం వెళ్లే ముందు దానిని ప్రపంచానికి అందించాలి.
మనకు ఏదైనా ఆలోచన ఉంటే, దానిని అమలు చేయాలి.
జ్ఞానం ఉంటే పంచుకోవాలి.
మనకు ఒక లక్ష్యం ఉంటే, దానిని సాధించాలి.
ప్రేమించండి, పంచుకోండి, పంచండి, అన్నింటినీ లోపలే ఉంచవద్దు.
" మన చేతిలో ఒక మొక్క ఉండగా మనలో ఎవరికైనా అంతిమ సమయం వస్తే, దానిని నాటుదాం."
మనలో ఉన్న మంచితనపు ప్రతీ అణువునూ అందించడం, వ్యాప్తి చేయడం మొదలుపెడదామా?
పందెం ప్రారంభిద్దాం రండి ... ఖాళీగా మరణిద్దాం 

♾️
 *మన ప్రతిఫలం అనేది భౌతిక పరంగా కొలవబడదు, కానీ ఎవరినైనా వారి ఉద్దేశించిన* *గమ్యం లేదా లక్ష్యాన్ని చేరుకోవడంలో మనం వారికి ఎలా సహాయం చేయగలుగుతున్నాం* *అనే దాంట్లో ఉంది. కొన్నిసార్లు, వారికి కావలసిందల్లా ప్రేరణ, ప్రోత్సాహం మాత్రమే. 🌼* 

 *దాజీ* 


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

HFN Story team

💜🔺💜🔺💜🔺💜🔺💜

No comments:

Post a Comment