*365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో*
♥️ *కథ - 32* ♥️
*అనుభూతి - నాలోని మౌనశక్తికి నేను కృతజ్ఞతతో ఉన్నాను.*
*మౌనం యొక్క శక్తి - బుద్ధుడు - తత్వవేత్త*
ఒకసారి, ఒక గొప్ప తత్వవేత్త బుద్ధుడిని చూడటానికి వచ్చాడు. చాలా ప్రశ్నలకి అతనికి సమాధానాలు కావాలి. బుద్ధుని వద్దకు వచ్చి ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు.
బుద్ధుడు అతని మాట విని, "మీకు నిజంగా సమాధానాలు కావాలా? కావాలంటే, వాటి మూల్యం చెల్లించగలరా?" అని అడిగాడు.
తత్వవేత్త ఇలా సమాధానమిచ్చాడు, "నా జీవితమంతా, నేను సమాధానాల కోసం వెతుకుతున్నాను, నాకు చాలా సమాధానాలు వచ్చాయి, కానీ లభించిన ప్రతి సమాధానం నుండి, కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మీరు ఏ మూల్యం అడుగుతున్నారు? నేను పూర్తి ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం తహతహలాడుతున్నాను. ఈ సమాధానాలు లభించిన తర్వాతే ఈ భూమిని విడిచిపెట్టాలని నా కోరిక."
బుద్ధుడు, "మంచిది. చాలా మందికి సమాధానాలు కావాలి కానీ మూల్యం చెల్లించడానికి ఇష్టపడరు. అందుకే నేను మిమ్మల్ని అలా అడిగాను.
మీరు ఒక సంవత్సరం పాటు మౌనంగా ఉండాలి. ఇదే ఆ మూల్యం.
ఒక సంవత్సరం పాటు మౌనంగా నా దగ్గర కూర్చోండి, ఒక సంవత్సరం గడిచిన తర్వాత, ప్రశ్నలు అడగమని నేనే చెబుతాను. అప్పుడు మీరు నన్ను ఏ ప్రశ్న అయినా అడగవచ్చు.
నేను ప్రతి ప్రశ్నకీ సమాధానం ఇస్తానని, మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను."అని చెప్పాడు.
కానీ ఒక సంవత్సరం, మీరు పూర్తిగా స్థిరంగా, మౌనంగా కూర్చోవాలి. ఒక సంవత్సరం పాటు మీ ప్రశ్నలను తీసుకురావద్దు."
తత్త్వవేత్త అవుననాలా, వద్దనాలా అని ఆలోచిస్తున్నాడు. "ఒక సంవత్సరం అంటే చాలా సమయం, ఇతను నిజంగా నా ప్రశ్నలకు సమాధానం ఇస్తాడా?" అని తనలో తాను అనుకున్నాడు.
బుద్ధుడిని అడిగాడు, "ఒక సంవత్సరం తర్వాత నా ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇస్తానని మీరు పూర్తి హామీ ఇస్తున్నారా?"
బుద్ధుడు, "నేను పూర్తి హామీ ఇస్తున్నాను, మీరు అడిగితేనే, నేను సమాధానం ఇస్తాను, కానీ మీరు అడగకపోతే, నేను సమాధానం ఎలా ఇస్తాను?" అన్నాడు.
అప్పుడే పక్కనే ఉన్న చెట్టు కింద ధ్యానంలో కూర్చుని ఉన్న శిష్యుడు నవ్వడం మొదలుపెట్టాడు.
తత్త్వవేత్త బుద్ధుడిని అడిగాడు, "అతను ఎందుకు నవ్వుతున్నాడు?"
బుద్ధుడు, "మీరు వెళ్లి అతనిని అడగవచ్చు" అని సమాధానమిచ్చాడు.
తత్త్వవేత్త శిష్యుని దగ్గరకు వెళ్లి ఎందుకు నవ్వుతున్నావని అడిగాడు.
దానికి శిష్యుడు ఇలా సమాధానమిచ్చాడు, "నువ్వు ఏదైనా అడగాలనుకుంటే, ఇప్పుడే అడుగు, అతను నాతో కూడా అదే అన్నాడు.
కానీ అతను చెప్పేది నిజమే అని నీకు చెప్పగలను, అతనిని ఒక సంవత్సరం తర్వాత నీవు అడిగితే, అతను సమాధానం ఇస్తాడు, కానీ ఒక సంవత్సరం తర్వాత ఎవరు అడుగుతారు?
నేను ఇక్కడ ఒక సంవత్సరం పాటు మౌనంగా కూర్చున్నాను, ఇప్పుడు అతను నన్ను, ‘అడుగు నాయనా', అని పొడుస్తాడు.
ఒక్క సంవత్సరం మౌనంగా ఉన్న తర్వాత, అడగడానికి ఏమీ ఉండదు, ప్రతిదానికి సమాధానం లభిస్తుంది.
మీరు అడగాలనుకుంటే, ఇప్పుడే అడగండి; లేకపోతే, సంవత్సరం తర్వాత, అడగడానికి ఏమీ మిగలదు."
తత్వవేత్త సమాధానాలు తెలుసుకోవాలనుకున్నాడు, కాబట్టి అతను బుద్ధుడితో అక్కడే ఉన్నాడు.
రోజూ మౌనంగా కూర్చునేవాడు.
అతను కాలపు జాడను కోల్పోయాడు, ఎందుకంటే ఎవరి ఆలోచనలు నిదానిస్తాయో, వారు సమయం గురించిన అవగాహనను కోల్పోతారు.
కానీ బుద్ధుడికి కాలం / సమయం గురించి పూర్తి అవగాహన ఉంది.
ఒక సంవత్సరం పూర్తి కాగానే, అతను తత్వవేత్త దగ్గరకు వెళ్లి, "ఇప్పుడు మీరు ఏదైనా అడగవచ్చు, నేను వాగ్దానం చేసినట్లుగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను. మీరు అడగడానికి ఏదైనా ఉందా?" అని అడిగాడు.
తత్త్వవేత్త నవ్వడం ప్రారంభించి, "ఆ శిష్యుడు చెప్పింది నిజమే, ఇక్కడ నేను ఒక సంవత్సరం పాటు కూర్చుంటున్నాను, ఇప్పుడు నా వద్ద అడగడానికి ఏమీ లేదు, మీ దయ వల్ల, అన్ని సమాధానాలు నాకే తెలిసాయి" అని చెప్పాడు.
**సమాధానాలు ఇవ్వబడవు, కానీ స్వీకరించబడతాయి.*
*సమాధానాలు వెలుపల నుండి రావు, కానీ లోపల నుండి* *వస్తాయి.*
♾️*
*స్థిరమైన మౌనం, సమయానుకూల అప్రమత్తతలో, హృదయం మాట్లాడుతుంది. మనం హృదయాన్ని శ్రద్ధగా* *వింటే , దుర్బలపరిచే సందేహం, గందరగోళాన్ని బదులుగా విశ్వసననీయమైన నిర్ణయాలు* *మాత్రమే ఉంటాయి.*
*దాజీ*
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment