🙏🏻🪷. ధ్యానం అంటే ఏమిటి ?🪷🙏🏻
బుద్ధ ప్రోధిత " ఆనాపానసతి " అంటే మన ఉచ్చాస నిశ్వస ల తో మనము కూడుకుని ఉండటము అదే శ్వాస మీద ధ్యాస " ఆనాపానసతి "
ఆనాపానసతి అంటే
యిది గౌతమ బుద్ధుడు2500 సం..,క్రితం పాళీ
భాషలో ఉపయోగించిన పదము....
" ఆన" అంటే "ఉచ్ఛ్వాస "
" అపాన " అంటే నిశ్వాస
" సతి " అంటే కూడుకుని ఉండటం .
అంటే " మన శ్వాస తో మనము కూడుకుని ఉండటం . "
ఈ ధ్యానం అన్నదే సకల ఋషులు , ,యోగులు ఇచ్చిన అధ్భుత మైన వరం
అన్ని పద్ధతుల్లో ఉత్తమ మైనది , సరియైనది " ఆనాపానసతి "
ధ్యానం చేసే పద్ధతి ......
సుఖముగా, హాయిగా ఉండేలా కూర్చుని , చేతులు రెండూ వే ళ్లలో కి వేళ్ళూ పోనిచ్చి , ప్రశాంతముగా కళ్ళు మూసుకుని కూర్చుని , మనలో సహజముగా జరుగుతున్న ధ్యాస నీ గమనించాలి . ఏ దేవతారుపాన్ని గురుతు చేసూకో రాదు .ఆలోచనలు వస్తీ ధ్యాస ను మరల్చాలి. అలా చేస్తూ ఉంటే ఆలోచన స్థితి లోని మనసు శూన్య స్థితి కి వస్తుంది .ఆ స్థితి లో " విశ్వ మయ ప్రాణ శక్తి ...కాస్మిక్ ఎనర్జీ " అపారం గా మనలో ప్రవేశించి మన శరీరం లోని నాడి మండ లాన్ని శుద్ధి చేస్తుంది
ధ్యానం వలన లాభాలు.....
శారిక ఆరోగ్యం , ఏకాగ్రత ,జ్ఞాపక శక్తి , మానసిక ప్రశాంతత , జాగరూకత , అత్మ విశ్వాసం అవగాహన ,బుద్ధి సూక్ష్మ త , దివ్య చక్షువు , ఉత్తేజం , సూక్ష్మ శరీర యానము మొదలయినవి .
శాంతి శ్రీ గారి జ్ఞాన సౌజన్యం తో .
No comments:
Post a Comment