Wednesday, October 18, 2023

’విశ్వమంతటికీ ఆధారమై ఉన్నవాడు’ అనే అర్థం శివనామానికి ఉంది. అనంత విశ్వానికి ఆధారమై, తన సహజశక్తితో జగమంతా నడిపే ఈశ్వరుడి అసలు తత్త్వం ‘శాంతం, శుద్ధం, శుభం, క్షేమం.’

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝*’విశ్వమంతటికీ ఆధారమై ఉన్నవాడు’ అనే అర్థం శివనామానికి ఉంది. అనంత విశ్వానికి ఆధారమై, తన సహజశక్తితో జగమంతా నడిపే ఈశ్వరుడి అసలు తత్త్వం ‘శాంతం, శుద్ధం, శుభం, క్షేమం.’* 
💕 *ఈ నాలుగింటినీ ఒక్క పదంలో చెబితే... ఆ పదమే ‘శివ’. సామాన్య దృష్టిలో- ‘శివుడు ఒక దేవత. కోరిన వరాలిచ్చే దేవుడు’. తాత్త్విక దృష్టితో, యోగ భావనతో పరిశీలిస్తే చాలా అద్భుత తత్త్వాలు- వేద, పురాణ, ఇతిహాస, ఆగమ, కావ్యాది గ్రంథాల్లో గోచరిస్తాయి. సాధకుల ప్రయోజనాల కోసం ఒకే శివత్వం-‘శివాన్ని’(శాంతిని, శుద్ధిని, శుభాన్ని) ప్రసాదించడానికి బహు రూపాలు ధరించింది- అని శైవగ్రంథాలు వివరిస్తున్నాయి.* 
💞 *ఒకే ఈశ్వర శక్తియే స్త్రీ, పురుష తత్త్వాలుగా విశ్వమంతా వ్యాపించినది- అనే సత్యానికి సాకారం ‘అర్ధనారీశ్వర’ మూర్తి.*
❤️ *చైతన్యాన్ని ‘జ్యోతి’ అనడం శాస్త్ర పరిభాష. అన్నిటా లీనమైన ఆ చైతన్య జ్యోతినే ‘జ్యోతిర్లింగం’ అన్నారు. శరీరంలో పది కర్మేంద్రి యాల్లో, పది  జ్ఞానేంద్రియాల్లో, మనస్సులో, జీవునిలో (పన్నెండింటిలో) లీనమైన ఈశ్వర చైతన్యమేద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపం! అలాగే మనలో- ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన- అనే పంచప్రాణాల్లో, నాగ, కూర్మ, కృకర,దేవదత్త,ధనంజయ-అనే అయిదు ఉపప్రా ణాల్లో వీటికి ఆధారమైన ఆత్మలో జన్మ (మొత్తంపదకొండు) ప్రాణశక్తులే ఏకాదశ రుద్రులు.*
💖 *పంచభూతాలు, పంచతన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప,* *రస, గంధాలు), పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచప్రాణాలు* *అనే పంచతత్వాల్లో నిండిన చైతన్య రూప శక్తి శివుడు.అందుకే* *ఆయనను పంచముఖుడిగా*
*శాస్త్రాలు దర్శించాయి.*
💓 *దేవతలను శాసించే శక్తి కుమారస్వామిగా, పలు సమూహాలను (గణాలను) నియమించే శక్తి గణపతిగా- ఈ రెండూ తన నుంచి వచ్చిన పుత్రులుగా పరివారమూర్తి శివుడు సాక్షాత్కరిస్తాడు.*
💕 *పంచభూతాల్లో, సూర్యుడిలో, చంద్రుడిలో, జీవి చైతన్యంలో- వెరసి ఎనిమిదింటిలో- ఒకే శివుడు వ్యాపించి విశ్వరూపుడయ్యాడు.* 
💕 *ఆ ఎనిమిదింటినీ శివుని ‘అష్టమూర్తులు’గా వేదాది శాస్త్రాలు పేర్కొన్నాయి.*

❤️ *శివుడి మూర్తులన్నింటిలో దివ్యమైన యోగరహస్యాలు, తత్త్వ సంకేతాలు, జ్ఞాన విశేషాలు గోచరిస్తాయి. ఏ రూపమూ లేని జ్యోతి స్వరూపుడైనా తన బహువిధ శక్తులను బహురూపాలతో ప్రకటించడమే శివలీల.*
💖 *అపమృత్యువులను, అకాల మృత్యువును, అజ్ఞానమనే అసలు మృత్యువును తొలగించే అమృతేశ్వరుడు ‘మృత్యుంజయుడు’. శాశ్వతమైన ఆనందతత్త్వానికి సాకారమే మృత్యుంజయమూర్తి.*
💖 *దుఃఖాలను, రోగాలను పోగొట్టేవాడు కనుక ‘రుద్రు’డు.*
💖 *దేవతలకు సైతం శాసకుడు కనుక ‘మహాదేవుడు’.*
💖 *శుభానికి మూలమైనవాడు కనుకనే ‘శంభుడు’.*
💖 *శుభాలను ప్రసాదించేవాడు కాబట్టి ‘శంకరుడు’ అని వేదసూక్తాల్లో శివనామాలు కీర్తిస్తున్నాయి.*

💝 *జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి... అవస్థల్లో ఈశ్వర చైతన్యం అంతర్లీనంగా ఉన్నప్పటికీ, అవస్థల తాదాత్మ్యం వల్ల ఈశ్వరుని తెలుసుకోలేకపోతుంటాం.* 
❤️ *యోగులు ధ్యాన సమాధిలో ఈ మూడు అవస్థలను దాటిన ‘తురీయ’ భూమికలో బ్రహ్మానంద రూపంగా ఈశ్వరానుభూతిని పొందుతారు.యోగసాధనతో, తత్త్వజ్ఞానంతో శుద్ధమైన బుద్ధి ఇన్ని రకాలుగా శివతత్త్వాన్ని అనుభవానికి తెచ్చుకోగలదు, అనంతమైన శివత్వంతో ఐక్యం కాగలదు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕 *~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment