https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v
🌺 అమృతం గమయ 🌺
🌺 అమృత సత్యం 🌺
కోపం - ఒక రోగం
*పైశున్యం సాహసం ద్రోహం ఈర్ష్యా౬సూయార్థ దూషణమ్!*
*వాగ్దండయోశ్చ పౌరుష్యం క్రోధజో౬పి గుణోష్టకః!!*
కోపం వలన కలిగే అష్ట దుర్గుణాలు:
1.నిందలు వేయడం,
2.తొందరపాటుతనం,
3.అన్యులకు హాని చేయడం,
4.ఓర్వలేనితనం,
5.ఇతరులలో ఉన్న మంచి గుణాలను దోషాలుగా ప్రచారం చేయడం,
6.కఠినంగా మాట్లాడడం,
7.నిష్కారణంగా నిందించడం,
8.పరుషంగా మాట్లాడడం -
ఈ ఎనిమిదీ కోపం నుండి పుట్టిన దుర్గుణాలు.
శాంతియుతమైన మనసు లేనివారు రోగులే. తమ జీవితాలను బాగు చేసుకోలేకపోగా ఇతరుల జీవితాలను శిథిలపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
No comments:
Post a Comment