*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝*రానున్న పది సంవత్సరాల్లో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు కానున్నది.*
💖*ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.*
💕*వాళ్ళు:~*
💓*~రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు*
💓*~ఉదయం పెందరాళే లేచేవాళ్ళు.*
💓*~నడక అలవాటు ఉన్నవాళ్ళు.*
💓*~మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు.*
💖*వాళ్ళు:~*
💕*పొద్దుటే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !*
💕*~ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!*
💕*~మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!*
💕*~పూజకు పూలు కోసే వాళ్ళు*
💖 *వాళ్ళు:~*
💞*పూజ పూర్తి కాకుండా ఏమీ తినని వాళ్ళు !*
💞 *మడికట్టుకుని వంట వండేవాళ్ళు!*
💞*దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!*
💓*దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు.*
💓*దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !*
💓*మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!*
💖*వాళ్ళు:~*
💕*~అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు.*
💕*~కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు.*
💕*~స్నేహంగా మెలిగే వాళ్ళు.*
💕*~తోచిన సహాయం చేసేవాళ్ళు.*
💕*చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు.*
💖*వాళ్ళు:~*
💞*ఉత్తరాల కోసం ఎదురుచూసిన వాళ్ళు.*
💞*ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు.*
💞*పాత డబ్బా ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు.*
💞*ఫోన్ నెంబర్ లు డైరీలో రాసిపెట్టుకునే వాళ్ళు.*
💖*వాళ్ళు:~*
💓*~పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు.!*
💓*~కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు..!*
💓*~సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు...!*
💓*~పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు ..!*
💖*వాళ్ళు:~*
💕*తీర్థయాత్రలు చేసేవాళ్ళు.!*
💕*ఆచారాలు పాటించే వాళ్ళు..!*
💕*తిధి,వారం ,నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు!*
💕*పుట్టిన రోజున దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు!*
💖*వాళ్ళు:~*
💓*~చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు.!*
💓*~లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు...!*
💓*~చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు....!*
💓*~అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు.!*
💝*మీ_ మా వాళ్ళు ..!*
💓*తలకు నూనెలు రాసుకునే వాళ్ళు*
💓*జడగంటలు పెట్టుకున్నవాళ్ళు.*
💓*కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు.*
💓*చేతికి గాజులు వేసుకునే వాళ్ళు.*
💓💓*ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువులతో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషులతో స్నేహంగా గడిపిన తరం...!*
💖 *ప్రస్తుత తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు*
❤️ *వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా ‘క్యూ’ కట్టి, మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.*
❤️ *మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారిప్పుడు*
💖 *మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళుంటే దయచేసి వాళ్ళకు మీ ప్రేమను కాస్త పంచండి.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment