*దేవి భాగవతం గురించి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విశేషాలు*🚩🚩🚩🚩
By Praveen Taduri
జాతీయ సాహిత్య పరిషద్ (RSS)
జిల్లా అధ్యక్షులు, ఇందూరు.
🚩🚩🚩🚩🚩
*దేవి భాగవతం అంటే ఏమిటి?*
1) దేవి భాగవతం అత్యంత పవిత్రమైన మహోత్తర పురాణం.
2) మొదటి సారి దీనిని వ్యాస మహర్షులవారు, జనమేజయ మహారాజులవారికి వినిపించారు. జనమేజేయుడు పరీక్షిత్ మహారాజు కుమారుడు. పరీక్షిత్ మహారాజు అభిమాన్య కుమారుడు మరియు అర్జునుడి మనవడు.
3) తర్వాత మిగితా ప్రపంచానికి సూత మహర్షులవారు దేవి భాగవాతాన్ని, ననైమిషారణ్యములో శౌనకాది మునులకు తెలియజేసినారు.
4) దేవి భావతం మొత్తం 18000 శ్లోకాలతొ, 12 స్కందాలుగా విభాజనం చెంది ఉంది.
5) ఒక ముని శ్రాపం వలన పరీక్షిత్ మహారాజు తక్షకుడు అని సర్పరాజు వలన మరణిస్తాడు. అతని ఆత్మ సంశుద్దిని ఆశిస్తూ జనమేజేయుడు ఈ దేవి పురాణాన్ని వ్యాసుల వారి నుండి వింటాడు.
6) జనమేజేయుడు మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ దేవిభగవతాన్ని విని, దేవియజ్ఞం పూర్తి చేస్తాడు.
7) మహిమాన్విత దేవిభావాతాన్ని ద్వాపర యుగాంతం లొ మొదటి సారి వినిపించడం జరిగినది.
8) దేవిభగవతాన్ని ఎప్పుడైనా వినవచ్చుని, చదవ వచ్చును అని మొదట స్కంధం 30 వ శ్లోకం చెబుతన్నది.
9) శ్రీకృష్ణ భాగవానుడు శ్యమంతక మని కోసం వెళ్లి తిరిగి రానప్పుడు, వసుదేవుల వారు శ్రీ దేవిభావాతాన్ని యజ్ఞ రూపేన ఆలకించినప్పుడు, శ్రీకృష్ణుడు విజయలక్ష్మిసనాథుడై తిరిగి వచ్చినారు.
10) దేవిభగావత యొక్క మహత్యాన్ని శ్రీ స్కాంద పురాణం లొ, మానస ఖండం, శ్రీ దేవి భాగవత మహత్యం లొ మొదటి అధ్యాయం, 50 వ శ్లోకం లొ చూడవచ్చును.
11) దేవి భాగవతాన్ని ఏ ఏ విధి విధానాలతో చదవాలి లేదా వినాలి అన్నది దేవి భాగవతం లొ 5 వ స్కంధం లోని శ్లోకాల్లో ఉంది అలాగే శ్రీ స్కాంద పురాణం లొ కూడా ఉన్నది.
12) సరస్వతి దేవి పూజ, తులసి పూజ, సావిత్రి పూజ, లక్ష్మీ పూజ, దక్షిణాదేవి పూజ, మంగళ చండి దేవి పూజ, మాంసాదేవి పూజ, దుర్గా దేవి పూజ.. అన్ని కూడా దేవి భాగవతంలో లో తొమ్మిదవ స్కంధం లొ ఉంటాయి.
🚩🚩🚩🚩🚩🚩
మీకు వీలైతే ఈ విశేషాలను ఇతరులకు కూడా పంపి తరించండి
🚩🚩🚩🚩🚩🚩🚩
మీ శుభం కలుగును గాక
By Praveen Taduri
జాతీయ సాహిత్య పరిషద్ (RSS)
జిల్లా అధ్యక్షులు, ఇందూరు.
🚩🚩🚩🚩🚩🚩🚩
No comments:
Post a Comment