Thursday, September 26, 2024

 జై గిరిధారి !

ప్రశ్న :.   జగద్గురు అంటే అర్ధం 
             ఏమిటి ?

సమాధానం :

పదాన్ని జాగ్రత్తగా పరిశీలించి గ్రహిస్తే ఆ పదమే అర్ధాన్ని చెప్తుందని గురుదేవులు చాలా సార్లు చెప్పారు .

జగత్ +గురు ( గు +రు )= జగద్గురు .

జాయతి గఛ్చతి ఇతి జగత్ . వచ్చి పోయేదని అర్ధం . ప్రతిక్షణం పరిణామశీలం .కనుక 
జగత్తు సత్యం కాదు .  కనిపిస్తున్నది కనుక లేనిదీ కాదు .
ఉన్నది కాదు . ఉన్నట్లున్నది .
సత్యం కానిది . మాయ . ఆభాస .
సత్యం వస్తు సిద్ధం . మాయ ( ఆభాస , అజ్ఞానం ) బుద్ధిసిద్ధం .

        ఉన్నట్లున్నది తొలగితేనే ఉన్నది తెలుస్తుంది .

       బ్రహ్మ సత్యం జగమిధ్య 
మిధ్యం ఎలాతొలగుతుంది .
జ్ఞానం ద్వారానే .
దృష్టిం జ్ఞానమయంకృత్వా పశ్యేత్ బ్రహ్మ మయం జగత్ .

     చీకట్లో వస్తువు లేనిది కాదు . చీకటి వలన ఉన్నది కనిపించుట లేదు . వెలుగు ( జ్ఞానం ) వస్తే ఆవరించిన ఆ చీకటి పోయి ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది .

     చీకటి అనగా " గు " 
     తొలగించేవారు " రు "
                
                       అంటే 
జగత్ అనే చీకటిని తొలగించే వారే 
జగద్గురువు .

జీవ , జగత్ , ఈశ్వర భేదం ; జీవేశ్వర భేదం ,ఇంకా జగత్ సత్యమని చెప్పే ఏ సంప్రదాయపు గురువైనా , వారు ఎంతటి వారైనా జగద్గురువు కారు ,కాలేరు .

       అద్వైతామృత జ్ఞానదాత 
        కృష్ణం వందే జగద్గురుం 

" జ్ఞానీతాత్మైవమేమతం " కనుక  

        ఆ పరంపరలో వచ్చిన జ్ఞానే 
                    జగద్గురువు 
                         
                            ఓం

No comments:

Post a Comment